శుక్రవారం, మార్చి 29, 2024
Homeఅంతర్జాతీయంభారత ఆర్మీలోని హిందూ-సిఖ్ జవాన్ల పై పాకిస్థాన్ సోషల్ మీడియాలో కుట్రలు

భారత ఆర్మీలోని హిందూ-సిఖ్ జవాన్ల పై పాకిస్థాన్ సోషల్ మీడియాలో కుట్రలు

భారత్ ఒకవైపు చైనాతో బోర్డర్ లో పోరాడుతుంటే మరోవైపు పాకిస్థాన్ వెనకనుండి దొంగ దెబ్బ తీయడానికి ఉగ్రవాదులను సరిహద్దులు దాటిస్తుంది. తాజాగా భారత్ –చైనా దేశాల మద్య బోర్డర్ లో ఉద్రిక్తతలు మొదైలైన నాటి నుండి భారత్ పై పలు సంఘటనలలో పాకిస్థాన్ తన మీడియా చానెల్ లో తప్పుడు వార్తలు ప్రచురించి బోర్డర్ లో చైనా ను రెచ్చగొట్టే సలహాలు చాలానే ఇచ్చింది. అయితే తాజాగా పాకిస్థాన్ లోని సోషల్ మీడియా వేదికగా భారత జవాన్ల మత విశ్వాసాలను రెచ్చగొట్టి.. వారు మనో దైర్యం కోల్పోవడానికి కొత్త పన్నాగాలు పన్నుతోంది. ఇండియాలో ప్రస్తుతం సుమారు అన్ని రాష్ట్రాల నుండీ మన ఆర్మీ లో సేవలు అందిస్తున్నారు. వీరిలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన సిఖ్ సోదరులు కూడా ఆర్మీలో ప్రదాన పాత్ర పోషిస్తున్నారు. వీరు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, వంటి త్రివిద దాలాల్లో వీరు చేస్తున్న సేవలు అమోగం.

ప్రస్తుతం పాకిస్థాన్ లోని సోషల్ మీడియాలో వీరిని రెచ్చగొట్టే చర్యలు చేస్తున్నారు. 13వేలమంది సైనికులు ఇండియన్ ఆర్మీ కి రిజైన్ చేసి పంజాబ్ కలిస్థాన్ ఉద్యమంలోకి వీరు చేరుతున్నారని, భారత్ ఆర్మీ సిక్కులపై వివక్ష చూపిస్తుందంటూ అక్కడి మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అంతేకాక భారత్ లో ఎలాంటి యుద్దాలు జరిగినా, దేశాల మద్య గర్షణలు జరిగినా హిందూ జవాన్లు సిఖ్ జవాన్లను ముందుంచి వారి మరణానికి కారనమవవుతూ వెనుకనుండు హిందూ జవాన్లు  తమాషా చూస్తున్నారని  రెండు మతాల మధ్యా విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు.

అంతేకాక భారత ఆర్మీ లో సిక్కులు లేకుండా మోడీ ఏమిచయగలడో చూద్దాం అంటూ మోడిపై విమర్శలు గుప్పించారు. అయితే అసలు పంజాబ్ లోని ఖలిస్థాన్ ఉద్యమం భారత్ –పాకిస్థాన్ విడిపోయిన తరువాత కొన్నాళ్ళకు తమకు ప్రత్యెక దేశం కావాలని కోరుకుని దానికి కలిస్థాన్ అనే పేరు పెట్టుకున్నారు. అయితే ఈ ఖలిస్థాన్ అప్పటి ప్రభుత్వ వైఫల్యం మూలంగానే అవతరించింది. అయితే దీనికి అప్పట్లో ఇందిరాగాంది కూడా మద్దతు తెలిపారు. దీనితో ఈ ఉద్యమం చాలా కాలంపాటు ఉద్రుతంగా సాగింది తరువాత ఆ ఉద్యమం నెమ్మదిగా చల్లారినా కూడా ఆ ఉద్యమం పై కూడా రాజకీయాలు చేసారు. దీనిలో కాంగ్రెస్ కు చెందిన పంజాబ్ నేత కూడా వెనక నుండి నడిపిస్తున్నారనే అనుమానాలు కూడా తలెత్తాయి.

అయితే ఈ ఉద్యమంలో ఐఎస్ఐ పాత్ర ఉన్నట్లు అప్పట్లో ఇంటలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేసాయి.  అయితే ఇప్పుడు ఖలిస్థాన్ 2020 రెఫరెండం మళ్ళీ ప్రారంబించడంతో పాకిస్థాన్ తెగ సునకానందం పొందుతుంది. ఎక్కడైనా ఒక దేశం తమ ప్రజలను దేశాన్ని కాపాడటానికి ఆర్మీ పనిచేస్తుంది కాని పాకిస్థాన్ వంటి దేశం మతం అనే ఉన్మాదంతో ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ అక్కడి ఆర్మీ పనిచేయడం సిగ్గుపడాల్సిన విషయం.

రెండు రోజుల క్రితం పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు నిధులు నియంత్రించడంలో విఫలమైనందుకు పాకిస్థాన్ ను గ్రే లిస్ట్ ను మరి కొన్నాళ్ళు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే పాకిస్థాన్ మాత్రం భారత ఆర్మీ కి సలహాలు ఇవ్వడం మాని గ్రే లిస్టులో ఉన్న పాకిస్థాన్ బ్లాక్ లిస్టు లోకి వెళ్ళకుండా చర్యలు తీసుకుంటే మంచిది. లేకపోతే తినడానికి తిండి దొరక్క అడుక్కు తినడానికి ఉగ్రవాదుల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళే పరిస్థితి కూడా రావచ్చు.

Read also….

 

 

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular