పాక్ దుశ్చర్య… భారీ సంఖ్యలో హిందువుల ఇళ్ళ కూల్చివేత

0
285
Pakistan diploys hindus houses
Pakistan diploys hindus houses

పాకిస్థాన్  చేష్టలు రోజు రోజుకీ హద్దలు దాటుతున్నాయి. చాలా రోజులుగా అక్కడి హిందూ దేవాలయాల కూల్చివేతలతో పాటు ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఆ వర్గానికి సంబంధించిన నాయకులు మరియు కార్యకర్తలు పాకిస్తాన్ లో నివసిస్తున్న హిందువులపై దాడులు చేస్తూనే ఉన్నారు.

హిందువులను బలవంతపు మతమార్పిళ్లు చేస్తున్నారు. అంతేకాక అక్కడి హిందూ మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం దీనిపై నోరుమెదపని పరిస్థితి. తాజాగా హిందువులు ఎక్కువగా నివసించే సింధు ప్రావిన్స్ ప్రాంతంలో హిందువుల ఇళ్లను ప్రొక్లైన్లతో ఇష్టానుసారం వాటిని నేలమట్టం చేశారు.

తమ ఇళ్లను కూల్చొద్దంటూ  అక్కడి ప్రజలు నాయకులను బ్రతిమాలినా నిర్దాక్షిణ్యంగా వాటిని కూల్చేశారు. కొందరు మాత్రం వారి ఇళ్లను కాపాడుకునేందుకు ఇంటి లోపలే ఉండిపోగా వారిని బయటికి లాక్కొచ్చి మరీ ఇళ్లను కూల్చేశారు.

కొందరైతే ఇంటిపైకి ఎక్కి కూల్చొద్దంటూ బ్రతిమిలాడారు. ఇప్పుడు ఈ ఘటన హృదయవిదారకంగా మారింది. పాకిస్థాన్ లో ఈ అఘయిత్యాలు చేస్తుంది మరెవరో కాదు అక్కడి గృహశాఖా మంత్రి మరియు ఆ పార్టీ కార్యకర్తలే.

తాజాగా ఇలాంటి ఘటనలు పాకిస్థాన్ లో కొన్ని రోజులుగా మరీ ఎక్కువైపోయాయి. ఒకవైవు పాకిస్థాన్… ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో అక్కడ ప్రజలపై భారత్ బలగాలు ఎటువంటి హింసాత్మక ఘటనలూ చేయకపోయినా పాకిస్థాన్ మాత్రం భారత్ కాశ్మీరీలను ఎదో చేస్తుందని మసిపూసే ప్రయత్నాలు చేసేది.  అయితే ఇప్పుడు అక్కడ జరుగుతున్న హింసాకాండకు పాకిస్థాన్ మాత్రం నోరు మెదపడంలేదు.