మరోసారి అమిత్ షా కి అస్వస్థత

0
153
అమిత్ షా
అమిత్ షా

హోంశాఖ మంత్రి అమిత్ షా కి ఆరోగ్యం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు . ఆయన ఊపిరి తీసుకోలేకపోతుండటంతో ఆయన్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ చేశారాని మనకు తెలుసు. ఆగస్ట్ 2న అమిత్ షాకి కరోనా పాజిటివ్ వచ్చింది. దింతో  ఆయన్ని వెంటనే గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.

ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న అయన ఆగస్ట్ 14న డిశ్చార్జి అయ్యారు. తర్వాత మరోసారి ఆయనకు అనారోగ్య  సమస్య తలెత్తడంతో మళ్లీ ఆగస్ట్ 18 న ఢిల్లో లో  AIIMS లో చేరారు. మళ్ళీ  ఆగస్ట్ 31న డిశ్చార్జి అయ్యారు.

ప్రస్తుతం తాజాగా  శనివారం రాత్రి ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండటంతో శనివారం రాత్రి 11 గంటలకు అమిత్ షా మరోసారి ఎయిమ్స్‌లో చేరినట్లు సమాచారం. అమిత్ షా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇది రొటీన్ చెకప్పే అని చెప్తున్నారు  సంబంధీకులు. డాక్టర్ల సూచనమేరకు  ఆయన ఎయిమ్స్‌లో చేరారని తెలుస్తోంది.