Nitya Menon టాలివుడ్ లో టాలెంట్ హీరోయిన్లలో ఒకరు అందతో మాత్రమె కాకుండా అభినయంతో అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బొద్దుగుమ్మ నిత్యా మీనన్ నేడు ఈమె పుట్టిన రోజు.
నిత్యా మీనన్ తెలుగులో నితిన్ సరసన “ఇష్క్” , “గుండె జారి గల్లంతయ్యిందే” వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్వతహాగా కేరళకు చెందిన అమ్మాయే అయినా తెలుగు తమిళం వంటి ఇతర బాషల పై ఉన్న మక్కువతో పలు భాషల్లో అనేక చిత్రాలు చేసి అబినయం తో పాటు మంచి పేరు కూడా సంపాదించుకుంది.
Nitya Menon గ్లామేర్ షోల జోలికి పోకుండా కధ, తన క్యారెక్టర్ నచ్చితేనే సినిమాకు సైన్ చేసేది నిత్యా. ఇలా ఇన్ని సినిమాలు చేయటం అంటే మామూలు విషయం కాదు. నచ్చిన Nitya Menon కు పాటలు పాడడం పై మక్కువ అందుకే తెలుగులో కూడా పలు సాంగ్స్ పాడి సినీ ప్రియులకు దగ్గరైంది.
ప్రస్తుతం మళయాళ సినిమాలతో చాలా బిజీ గా ఉండడంతో మంచి కధ దొరికితే తెలుగులో చేడానికి రడీగా ఉన్నట్లు చెబుతోంది. ఈ ముద్దుగుమ్మ ఇలాగే మంచి సినిమాలు చేస్తూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజావారధి తరపున నిత్యా మీనన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.