నిమ్మగడ్డ రమేష్ కుమార్(SEC) పై ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ లో కేసు నడుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేసు పై హైకోర్టు ఈ శుక్రవారం తీర్పును వెల్లడించింది. నిమ్మగడ్డ పై ప్రభుత్వం చేసిన ఆరోపణలు లను హైకోర్టు కొట్టివేసింది. ఆయన మళ్ళీ ఎన్నికల కమీషనర్ గా తన విధులను నిర్వహించాలని హైకోర్ట్ ఆదేశించింది.
ఇదిలా ఉండగా ఆర్టికల్ 213 ప్రస్తుతం ఆర్డినెన్స్ కు అధికారం ఇవ్వలేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంస్కరణల్లో భాగంగా కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించినట్లు గతంలో అఫిడవిట్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో రిటైర్డ్ జడ్జీలను SEC గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు ఆర్డినెన్స్ ను రూపొందించింది.
అయితే, గవర్నర్ ఆర్డినెన్స్ ఇప్పుడు పనిచేయదని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు తరువాత, న్యాయవాది జాంధ్యాల రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ క్షణం నుండి, ఆర్డినెన్స్ రద్దు చేయబడినందున రమేష్ కుమార్ ఎన్నికల కమీషనర్ గా కొనసాగుతారు అని కంఫర్మ్ చేసారు.