రానున్న 13 రోజులు అత్యంత కీలకం అమలాపురం ఆర్.డి. ఓ.

0
149
news 13 days most crucial Amalapuram rdo
news 13 days most crucial Rdo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఈ ఒక్క రోజు 47 కరోనా వైరస్  పాజిటివ్ కేసులు నమోదు అయ్యి మొత్తం గా 87 పాజిటివ్  కేసులు నమోదు కావడం అత్యంత కలవరపెడుతున్న విషయమని ప్రజలందరూ మరింత అప్రమత్తతతో వుండవలసిన సమయం ఆసన్నమైందని రెవెన్యూ డివిజనల్ అధికారి బి.హెచ్.భవానీ శంకర్ హెచ్చరించారు.

గడచిన 12 గంటల లోనే 47 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఎంతో కలవర పెడుతున్న విషయమని దీనిని దృష్టిలో ఉంచుకుని అమలాపురం డివిజన్ లో ఎక్కడి వ్యక్తులు అక్కడే వుండటం శ్రేయస్కరమని , డివిజన్ అంతటా పోలీస్ పహారా కట్టుదిట్టం చేశామని ఆర్.డి. ఓ తెలియచేశారు.

ప్రక్క రాష్ట్రాల నుంచి కానీ, ప్రక్క జిల్లాల నుంచి కానీ అత్యవసర సర్వీసులు మినహా డివిజన్ లోకి ఏటువంటి వాహనాలను గాని, వ్యక్తులను గాని ప్రవేశించడానికి అనుమతులు లేవని, అలాగే డివిజన్ నుండి బయటకు వెళ్ళడానికి కూడా అనుమతి లేదని ఆర్.డి. ఓ తెలియచేశారు.

ఒక్క ఆర్.డి. ఓ, డి.ఎస్.పి అధికారులు జారీ చేసిన పాస్ లు మినహా ఏటువంటి పాస్ లు చెల్లుబాటు కావని ఈ విషయంలో ఏటువంటి తాత్సర్యం జరిగినా సంభందిత అధికారుల  పైన,  వ్యక్తుల పైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్.డి. ఓ హెచ్చరించారు.

మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు తో బాటు నిత్యావసర సరుకులు , మరియు చౌక ధరల దుకాణాల లోని రేషన్ ను కూడా డోర్ డెలివరీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆర్.డి. ఓ తెలియచేశారు. సాధ్యమైనంత వరకూ రేపటి నుండే డోర్ డెలివరీ చేసేందుకు ప్రయత్నం చేస్తామని ఆర్.డి. ఓ తెలిపారు.

సామాజిక దూరం పాటించక పోయినా, అధిక ధరలకు విక్రయించినా ఆయా షాపులు పై తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్.డి. ఓ హెచ్చరించారు.ఈ రోజు ఉదయం 10 షాపులను సీజ్ చేయడం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు.

దేశవ్యాప్తంగా కరోనా మూడవ దశకు చేరుకునే ప్రమాదం పొంచి ఉందని, ఇది ప్రజలందరూ అప్రమత్తతతో వుండవలసిన సమయమని ఆర్.డి. ఓ అన్నారు. కోనసీమలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని, రానున్న 13 రోజులు అత్యంత అప్రమత్తత అవసరమని, డివిజన్ లో చాలా మంది కరోనా వైరస్ తీవ్రతను గుర్తించక సమూహాలుగా అల్లరి చిల్లరగా తిరుగుతున్నారని వాళ్ళు ఇకనైనా మానసిక స్పృహతో వుండాలని ఆర్.డి. ఓ తెలిపారు.

రేపటి నుండి అన్ని షాపులు ముందు ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలని, అలా కాని యెడల షాపులను సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరుగు తుందని ఆర్.డి. ఓ హెచ్చరించారు.

క్వారెంటైన్ కేంద్రాల ఏర్పాటు

అమలాపురం డివిజన్ లో ని అన్ని నియోజక వర్గాలలో ను క్వారంటై న్ కేంద్రాలు ఏర్పాటు  చేయడం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. అమలాపురం నియోజక వర్గానికి సంభందించి భట్లపాలెం బివిసి యింజినీరింగ్ కళాశాలలో 40 పడకలు ఏర్పాటు చేశామని వీటిని వందకు పెంచుతామన్నారు.

ముమ్మిడివరం నియోజకవర్గానికి సంభందించి ప్రసిద్ధ ఇంజినీరింగ్ కళాశాలలో 40 పడకలు, రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 60 పడకలు ఏర్పాటు చేశామని దీనిని 150 కు పెంచుతామని ఆర్.డి. ఓ తెలిపారు.

పి.గన్నవరం లోని కమ్యూనిటీ హాల్ లో 30 పడకలు ఏర్పాటు చేశామని, కొత్త పేట నియోజక వర్గానికి సంభందించి రావులపాలెం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 పడకల తో క్వారమ్ టై న్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ ఆర్.డి. ఓ తెలిపారు.

ఎటువంటి విపత్కర పరిస్థితినైన ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్దం గా ఉందని ప్రజలెవరూ బయపడ నవసరం లేదని రానున్న 13 రోజులు అత్యంత కీలకం కాబట్టి  ప్రజలందరూ ప్రభుత్వానికి సహక రించాలని ఆర్.డి. ఓ  విజ్ఞప్తి చేశారు.