ఆదివారం, జూలై 21, 2024
Homeజాతీయంనాలుగో దశ లాక్ డౌన్ 4.0 ఇలా ఉండనుందా..? | Lock Down 4.0

నాలుగో దశ లాక్ డౌన్ 4.0 ఇలా ఉండనుందా..? | Lock Down 4.0

ఇప్పటివరకూ మూడవవిడత అయిన 3.0 గడువు రేపటితో ముగియనుంది ఈ నేపథ్యంలోనే మే 18వ తేదీన లాక్‌డౌన్‌ 4.0 ఉంటుందని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ తెలియజేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ ఎన్ని రోజులు విధిస్తారు..? అసలు 4.0 తో వస్తున్న లాక్ డౌన్ నిబంధనలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీనికి ఎలాంటి మినహాయింపులు ఇస్తారు అనే వాటికి సంబంధించిన పలు వివరాలు నేడు బయటకు వెలువడనున్నాయి.

లాక్ డౌన్ 4.0 :-

ప్రధాని మోడీ ఇంతకు ముందు చెప్పినట్లుగా గత మూడు దఫాలుగా విధించిన  లాక్ డౌన్ కంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉండనుంది. అయితే కొందరు విశ్లేషకులు మాత్రం ఈ 4.0 లాక్ డౌన్ మే 31 వరకు ఇది పొడిగించే అవకాశాలు ఉన్నట్లు ఒక అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు ఆర్థికపరంగా కూడా ప్రజలకు మరింత ఊరటనిచ్చేలా అనేక సడలింపులు కూడా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుందని తెలుస్తోంది.

 రెడ్ జోన్లను నిర్ధారించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే పరిమితం చేసింది. దీంతో ఇక మీదట కంటైన్మెంట్ జోన్, బఫర్ జోన్‌గా   సెపరేట్ ప్రాంతాలను విభజించనున్నట్లు తెలుస్తోంది.

నిబంధనలు ఇలా..?

ఇక ప్రజాజీవనం కొంచం గాడిలో పడేవిధంగా రాష్ట్రాలలో పాఠశాలలు, థియేటర్స్, మాల్స్, జిమ్ములు మినహా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్నివిధాల కార్యకలాపాలకు అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్రాలకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే దేశీయంగా పలు  విమాన సర్వీసులు కూడా ప్రారంభమవుతాయి.ఇక కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాలలో కూడా పార్లర్, హెయిర్ సెలూన్లు ఓపెన్ అవ్వనున్నాయి. రెడ్ జోన్లలో కంటైన్మెంట్ జోన్లు మినహాయించి ప్రజా రవాణాలో పరిమితంగా ఒక్కొక్కటీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇక భారత రైల్వేశాఖ నడుపుతున్నఅనేక స్పెషల్ ట్రైన్స్ ఇకపై యధావిధిగా కొనసాగనున్నాయి. ప్రజల నిత్యావసరాలకు ఎటువంటి కొరత ఏర్పడకుండా పలు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ జారీ చేసిన కొత్త మార్గదర్శకాలలో వీటినిపేర్కొన్నారు. ఇక మత సంస్థలు, ప్రార్ధనా మందిరాలు కూడా ఇంకా కొన్నాళ్ళు మూసి ఉంచుతారు. ప్రజల నిత్తయావ్మసారాలకు మినహా  ఇంటివద్దే ఉండేలా కంటైన్మెంట్ జోన్లలో CRPC సెక్షన్ 144 క్రింద వీటిని అమలు చేయనున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular