టాలివుడ్ నటుడు మరియు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఇది గడిచి రెండ్రోజులు కాకముందే నాగబాబు మళ్ళీ తను పడగవిప్పారు ఈ సారి బాలయ్యని కాదు డైరెక్ట్ గా తన గురిని తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ ప్రదాన నేతలపైనా ఆయన గురిపెట్టారు.
ప్రస్తుత అధికారం తర్వాత అంటే వైసీపీ తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారన్న నాగబాబు.. వైసీపీకి తర్వాత మళ్ళీ వైసిపి వస్తుందా లేక జనసేన, బీజేపీ వీటికి మాత్రమే ఏపీలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎక్కువ వుంది కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం ఎప్పటికీ అధికారంలోకి రాదంటూ పలు ఘాటైన కామెంట్స్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు నాగబాబు.
అయితే ప్రస్తుతం ఈ గొడవకు కారణం సినిమాల షూటింగుల పునరుద్ధరణ, ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు చేయూత వీటి కోసం ఏర్పాటు చేసిన టాలివుడ్ సినీ పెద్దల సమావేశాలకు తనను ఆహ్వానించలేదని తప్పు పట్టిన బాలకృష్ణ పై రెండ్రోజుల క్రితం నాగబాబు అనేక ఘాటు వ్యాఖ్యలు చేసారు.
అంతేకాదు శనివారం తన ట్విట్టర్ లో టీడీపీపై పెద్దఎత్తున విరుచుకుపడుతూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. తమ హయాంలో తెలుగుదేశం నేతలు రాష్ట్రానికి చేసిందేమీ ( ఊడబొడిచిందేమి లేదని అన్నారు నాగబాబు) లేదని, కేవలం అవినీతి పాలన, ఇసుక మాఫియా వంటి కుట్రలు చేసారని అంటూ నాగబాబు చేసిన ట్వీట్లు ఇపుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్‌గా మారాయి.
అంతేకాక నాగబాబు అధికారం గురించి మాట్లాడుతూ మరోసారి వారు అధికారంలోకి వస్తామని కలలు కనే తెలుగుదేశం పార్టీ నేతలు ఊహాజనిత ప్రపంచం నుండి బయటికి రావాలని కోరారు లేకపోతే వారిని మానసిక రోగులు లానే పరిగణించాల్సి ఉంటుందని నాగబాబు సెటైర్లు వేశారు. అంతేకాక తాము పగటి కలల్లోనే జీవిస్తామని ఎవరైనా అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరని ఆయన సమాదానమిచ్చారు.
నాగబాబు చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ లోని రాజకీయ రచ్చకు తెరలేపాయని విశ్లేషకులు అబివర్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి ఇటువంటి దురుసు ప్రవర్తన Janasena Party ని డేమేజ్ చేస్తుందని అంతేకాక నాగబాబు ఇలాంటి కాంట్రవర్సీతో జెనసేనకు మరింత భారం అవుతున్నారని కొందరు అభిప్రాయం పడుతున్నారు.