శనివారం, నవంబర్ 26, 2022
HomeసినిమాBalakrishna వ్యాఖ్యలకు.. మెగా బ్రదర్ కౌంటర్.......

Balakrishna వ్యాఖ్యలకు.. మెగా బ్రదర్ కౌంటర్…….

తెలంగాణా సీఎం కేసీఆర్‌ తో సినీ ప్రముఖుల భేటీపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంపై  నాగబాబు కౌంటర్ ఇవ్వడంతో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. ఈ విషయం పై నాగబాబు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నాగబాబుమరియు బాలకృష్ణ ఇష్యూ చాలా హాట్ టాపిక్ అయింది.

కరోనా ప్రభావంతో  థియేటర్స్ మూసేసిన విషయం మనందరికి  తెలిసిందే అయితే  థియేటర్స్ మళ్ళీ ఓపెన్, షూటింగ్స్ రీ ఓపెన్ లాంటి అనేక అంశాలపై చిరంజీవి నేతృత్వంలో పలువురు దర్శకులు మరియు నిర్మాతలు ఇటీవలే కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశాలకు తనను పిలవలేదని Balakrishna ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే.

అక్కడ సినిమా వాళ్ళు భూములు పంచుకున్నారా? అని Balakrishna చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపడంతో మెగా బ్రదర్ నాగబాబు ఎంటరై మరిన్ని  సంచలన వ్యాఖ్యలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోమని బాలకృష్ణను హెచ్చరించారు. దీంతో ఈ ఇష్యూ పై చర్చలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో ఓ మీడియా ఛానల్‌ లో ఫోన్ శంభాషణలో పాల్గొని ఇందులో మాట్లాడిన నాగబాబు తన వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ వివరణ ఇచ్చారు.

ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఆ సమావేశానికి ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన ఒక్క వ్యక్తిని కూడా  పిలవాల్సిన అవసరం లేదా? అని ఒక ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు నాగబాబు బదులిచ్చారు. బాలయ్యను కూడా మీటింగ్ పిలవాల్సింది అని తాను కుడా అభిప్రాయపడినట్లు చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా తనకు Balakrishna ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవంటూ అలాగే ఆయనపై నెగెటివ్ ఒపీనియన్ కానీ, ఆయనపై శత్రుత్వం కానీ  లేదని.. గతంలో కూడా బాలకృష్ణను కమెడియన్ అని తాను అనలేదని నాగబాబు చెప్పారు. తనను ఆ మీటింగ్‌కు ఎందుకు పిలవలేదని బాలకృష్ణ ప్రశ్నించడంలో  ఏ తప్పు లేదని, అయితే భూములు పంచుకున్నారని అనడం మాత్రం సరైంది పద్ధతి కాదని చెప్పారు.

తెలుగు సినీ పరిశ్రమ అంటే ఎన్టీఆర్, చిరంజీవి వంటి ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే కాదని, వీరితో పాటుగా ఏఎన్నార్, కృష్ణ కుటుంబాలతో పాటు మరికొన్ని ఫ్యామిలీలు కూడా  ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇలాంటి మీటింగ్లకు మరియు ఫ్యామిలీలకు మద్య ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.

RELATED ARTICLES

Most Popular