మంగళవారం, నవంబర్ 28, 2023
Homeజాతీయంలాక్ డౌన్ పై మోడీ లైవ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు

లాక్ డౌన్ పై మోడీ లైవ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న కరోనా ఇప్పుడు భారత్ పై తన పంజా విసురుతుంది. కరోనాని ఎదుర్కోవడానికి ఈ నెల 14 వరకూ లాక్ డౌన్ విదించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై నిన్న పలు రాష్ట్రాల సీఎం లతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రదాని మోడీ ఈ రోజు ఉదయం మీడియాలో పలు సూచనలు చేసారు.

లాక్ డౌన్ విదించి 9 రోజులు అవుతుందని ప్రజలందరూ కఠిన పరీక్షలను ఎదుర్కొని విజయాన్ని సాదించారని అన్నారు. మనమందరం మార్చి 22 తారీకున కరోనాపై పోరాటం చేస్తున్న వారికి కరతాళ ద్వనులతో ధన్యవాదాలు తెలిపామని గుర్తుచేశారు.

ప్రపంచ దేశాలన్నీ ఈ మహమ్మారిని చప్పట్ల ద్వారానైతే నేమి గంట కొట్టి నైతే నేమి కరోనాను దేశంనుండి తరుముతున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి అనే చీకట్లను తొలగించి ప్రతీ వ్యక్తీ వెలుగులను నింపాలన్నారు. ఈ వెలుగులను నాలుగు దిక్కులా వ్యాపింప చేయాలన్నారు.

05 ఏప్రిల్ 9 గంటల 9 నిమిషాల వరకు ఇంటిలో కరెంట్ ఆపివేసి తమ వద్ద ఉన్న కోవోత్తులను వెలిగించాలని లేక మొబైల్ లో ఫ్లాష్ లైట్ ఆన్ చెయ్యాలని తద్వారా దేశం మొత్తం చీకట్లకు వెలుతురు యొక్క బలం ఎలా ఉంటుందో తెలియ చేయాలని కోరారు. కరోనా పై విజయానికి చేరువలో ఉన్నామని మరికొన్ని రోజులు ఇలాగే దైర్యంతో ఉండాలని కోరారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular