పోలీస్ స్టేషన్ ను చుట్టు ముట్టిన వలసకూలీలు

0
50
Migrant Labour
Migrant Labour

రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. సుమారు నలబై రోజులుగా చేయడానికి పనిలేక తినడానికి తిండి లేక ఆకలితో అలమతిస్తునారు. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను 17 వరకూ పొడిగించడంతో చేసేదేమీలేక చాలా మంది కాలినడకన సొంత రాష్ట్రాలకు బయలుదేరారు. వీరిలో గర్బిణీ స్త్రీలు ఉండడం చాలా మంది దారిలోనే మరణించడం వంటి హృదయవిదారాకర ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి.

కేంద్రప్రభుత్వం సైతం వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపడం కోసం పలు శ్రామిక్ రైళ్ళను ఏర్పాటు చేసి కొంత మందిని తరలించారు. అయితే తెలంగాణా సీఎం కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి లాక్ డౌన్ ను ఈ నెల 29 వరకూ పొడిగిస్తున్నట్లు తెలపడంతో ఇప్పట్లో పనులు దొరకవనే ఉద్దేశంతో నేడు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పరిధిలో  పోలీస్ స్టేషన్ వద్దకు అధిక సంఖ్యలో వలస కార్మికులు చేరుకొని తమను ఎలాగైనా సొంత రాష్ట్రాలకు పంపమని వేడుకున్నారు. లేనిపక్షంలో ఇక్కడే రోడ్డుపై బైటాఇస్తామన్నారు.

సొంత రాష్ట్రాలకు వెళ్ళడానికి తమకు పాస్ లు లేవని వెంటనే పాస్ లు ఇప్పించాలని కోరారు. అయితే తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఒరిస్సా,బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, జార్కండ్, రాష్ట్రాల కూలీలు సుమారు 10లక్షల మంది ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న సీఎం కేసీఆర్ సైతం వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించడానికి పలు రైళ్ళను ఏర్పాటు చేశామన్నారు.