ఆదివారం, జూలై 21, 2024
Homeసినిమాకీలక సమయంలో రక్త దానం చేసి నిజంగా మెగాస్టార్ అనిపించుకునాడు

కీలక సమయంలో రక్త దానం చేసి నిజంగా మెగాస్టార్ అనిపించుకునాడు

గత కొద్దిరోజులుగా కరోనా ప్రభావం ఎక్కువగా ఇండడంతో ప్రజలు ఇంటి వద్దనే ఉంటున్నారు దీనితో రక్త దాతలు ఇప్పుడు కరువయ్యారు. ఎమర్జెన్సీ టైమ్ లో సైతం తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చాలా హాస్పటల్స్ బ్లడ్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొన్ని సార్లు బ్లడ్ దొరక్క ప్రాణాలు పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. గత వారానికే బ్లడ్ బ్యాంక్స్ లో బ్లడ్ నిల్వల కొరత ఏర్పడింది. దీనితో మొన్నటి వారం సీపీ సజ్జన్నార్ తో పాటు  సైబరాబాద్ పోలీసులు, వాలంటీర్స్, రెడ్ క్రాస్ సిబ్బంది నేతృత్వంలో సుమారు 75 మంది రక్త దానం చేసారు.

అయితే ఇప్పటికీ ఈ కొరత అలాగే ఉండటంతో మెగా స్టార్ చిరంజీవి ముందుకొచ్చి రక్త దానం చేసారు. ఆయనతో పాటు హీరో శ్రీకాంత్ మరియు శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా రక్త దానం చేసారు.

రక్త దానం పై చిరంజీవి మాట్లాడుతూ కరోనా కారణంగా రక్త దాతల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. పలు హాస్పటల్స్ లో బ్లడ్ లబించక హార్ట్ ఆపరేషన్స్, డెలివరీ సమయంలో, కేన్సర్ , తలసేమియా వ్యాధి గ్రస్తులకు రక్తం దొరక్క ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

ఇలాంటి పరిస్థితిల్లో రక్త దాతలు అలాగే నా అబిమానులు రక్త దానం చేయాల్సిందిగా చేతులు జోడించి అడుగుతున్నానన్నారు. లాక్ డౌన్ సమయం లో రక్త దానం చేసేవారు దగ్గరలోని హాస్పటల్స్, బ్లడ్ బ్యాంక్స్ కి కాంటాక్ట్ చేసి బ్లడ్ డొనేషన్ ఫారం ఫిలప్ చేసి వాళ్లకు ఇస్తే దానిని ద్రువీకరించి మీకు వాట్స్ ఆప్ లో ఇమేజ్ పంపిస్తారని దానితో పోలీసులు అభ్యంతరం చెప్పరని తమకు గైడెన్స్ ఇచ్చి పంపిస్తారని అన్నారు.

రక్త దానం మానసిక సంతృప్తి ఇస్తుందని అన్నారు. అయితే చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో కూడా అనేక మంది రక్త దానం చేస్తుంటారు. ఇక ప్రతీ సంవత్సరం  చిరంజీవి పుట్టిన రోజు నాడు ఫాన్స్ రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకునేవారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular