లాక్ డౌన్ వల్ల నేడు ప్రజలు ఎక్కడి వాళ్లు అక్కడే ఇళ్లకు పరిమితమయ్యారు చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఇప్పటికే తినడానికి తిండిలేక చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. అయితే ఇలాంటి వాళ్లందరికీ సాయం చెయ్యడానికి ప్రస్తుతం చాలామంది దాతలు మంచి మనసుతో సాయం చెయ్యడానికి ముందుకొస్తున్నారు.
కానీ అలాంటి వాళ్లకు ఇప్పుడు జీహెచ్ ఎమ్ సీ తగు సూచనలు చేస్తోంది. ఈ మేరకు మేయర్ బొంతు రామ్మోహన్ సాయం చేసేవారికి కొన్ని జగ్రత్తలు పాటించాల్సిందిగా తెలిపారు. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో ఎవరైనా సాయం చెయ్యడానికి ముందుకొచ్చి ప్రజలకు ఆహార పదార్థాలను, తినే సరుకులను అందరికీ పంపిణీ చేయ్యడం వల్ల ఒకేచోట జనం గుమిగూడే ప్రమాదం ఉండడం వాళ్ళ అలాంటి పనులు ప్రస్తుతానికి ఎవరూ చేవ్వవద్దని సూచించారు.
ఒక వేల అలా సాయం చేసే ఆలోచన ఉన్నవారందరు తమకు వద్దకు తెలియజేయాలని, మీరు ఇచ్చే సాయాన్ని మొబైల్ వెహికల్స్ ద్వారా జీహెచ్ ఎంసీ సిబ్బంది సాయం కోరేవారికి అందిస్తామని తెలియజేశారు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకుని చెబుతున్న మాటగా అన్నారు మేయర్ బొంతు రామ్మోహన్.

దాతల నుంచి బియ్యం, ఆహారాన్ని సేకరించడానికి జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ ప్రియాంక ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రామ్మోహన్ తెలిపారు. నగరం మొత్తం పది మొబైల్ వాహనాల ద్వారా మీరు ఇచ్చిన ఆహారం, బియ్యాన్ని సేకరించి అవసరమైన, ఆకలితో ఉన్న ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు దాతలు బియ్యం, ఆహారం వీటితో పాటూ ఆకలితో ఉన్నవాళ్లకు ఏ సాయం అందజేయాలన్నా ట్విట్టర్ twitter@PDUCD_GHMC,మొబైల్ నెం: 94931 20244, 70939 06449 లను సంప్రదించాలని కోరారు.
దీంతోపాటూ ప్రజలకు తాత్కాలిక షెల్టర్స్ లో ఉంచిన వలస కార్మికులు, నిరాశ్రయులు, అనాథలకు మాస్కులు, తిండి ఇతర వస్తువులను పంపిణీ చేయడానికి జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాన్ని సంప్రదించాలన్నారు.