సైకిల్ పై శవాన్ని తీసుకెళ్తూ… కంటతడి పెట్టించాడు.

0
168
man carry Deadbody on cycle i kamareddy district
man carry Deadbody on cycle i kamareddy district

కరోనా దెబ్బకి లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో దేశం స్తంభించింది. ఇలాంటి సమయంలో కామారెడ్డి జిల్లాలో జరిగిన ఒక సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది. కామారెడ్డి జిల్లాలో గంజ్ ప్రాంతంలో ఉండే మార్కెట్ లో ఒక వ్యక్తి ఎప్పటి నుంచో కూలీగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండగా పలు దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉండటం తో అతను ఆదివారం మృతిచెందాడు.

అసలే లాక్ డౌన్ శవాన్ని తీసుకెళ్లే మార్గం లేదు చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వగా అది అనుమానాస్పద మృతి అని కాబట్టి శవాన్ని దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. ఆ పనిని ఒక పారిశుధ్య కార్మికుడికి అప్పగించారు అంబులెన్సుకి ఫోన్ చెయ్యగా ప్రస్తుతం అవి అందుబాటులో లేకపోవడంతో ఆ పారిశుధ్య కార్మికుడు శవానికి గుడ్డ చుట్టి సైకిల్ మీద పెట్టుకుని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు ఈ ఘటన అందరిని కలచివేసింది.