మహారాష్ట్రను వణికిస్తున్న Nisarga తుఫాన్….ఏపీ లోనూ భారీ వర్ష సూచన

nisarga toofan news in telugu

అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన నిసర్గ తుఫాన్ దాటికి ముంభై తీరం చిగురుటాకులా వణికింది. నేటి ఉదయం ముంభై తీరాన్ని తాకినా నిసర్గ తుఫాన్ అల్లకల్లోలాన్ని సృష్టించింది. సముద్ర తీరంలోని పెద్ద ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. ఉదయం మొత్తం 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులతో కూడిన వర్షం మహారాష్ట్ర పై విరుచుకు పడటంతో రోడ్ల పక్కనున్న చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలాయి.

కొన్నిచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోగా ఇంకోన్నిచోట్ల రోడ్లపై ఉన్న మోటర్ సైకిల్స్ ను సైతం గాలి అర కిలోమీటర్ మేర ఈడ్చుకు వెళ్ళింది. ఇంత భారీ తుఫాను ముంభై ని తాకడం 130 ఏళ్లలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం గాలుల తీవ్రత తగ్గి వర్షం కురుస్తుంది. సముద్ర తీరానికి ప్రజలు రాకుండా అధికారులు 144 సెక్షన్ అమలుచేసారు.

నిసర్గ తుఫాన్ ఎక్కువగా రాయగడ్ కు తాకడంతో భారీ నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మహారాష్ట్ర తో పాటు గుజరాత్ కు కూడా నిసర్గ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో ఎక్కువ ప్రభావం గల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రదాని మోడీ ఫోన్ లో మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే తో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీసారు. ఎటువంటి సహాయం కావాలనా తప్పకుండా ఆదుకుంటామని హామీఇచ్చారు. గుజరాత్ సీఎం తో మాట్లాడిన మోడీ ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలనిసూచించారు. నిసర్గ ఎఫెక్ట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాసం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి