మంగళవారం, జూన్ 18, 2024
Homeజాతీయందశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచన

దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచన

పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముకం పట్టినా ఇంకా చాలా చోట్ల పాజిటివ్ కేసులు పెరగడంతో ఈ రోజు ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎం లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో ప్రదాన అంశంగా ఆయా రాష్ట్రాల కేసుల వివరాలు తెలుసుకున్న ప్రదాని లాక్ డౌన్ విషయం పై చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ నెల 14 వరకూ లాక్ డౌన్ ఉండగా పలు రాష్ట్రాల సీఎం లతో లాక్ డౌన్ ఎత్తివేసే అంశంపై చర్చించగా దేశం మొత్తం ఒక్కసారిగా కాకుండా ఆయా రాష్ట్రాల ప్రభావాన్ని బట్టి దశల వారీగా ఎత్తివేయాలని కోరారు. పలు రాష్ట్రాల నుండి కరోనా తీవ్రత గురించి తెలుసుకున్న కేంద్ర ప్రబుత్వం కొంత సమాచారాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular