మంగళవారం, జూన్ 18, 2024
Homeరాజకీయంలాక్ డౌన్ సడలింపుతో ప్రజలకు జగన్ సర్కార్ తీపికబురు.

లాక్ డౌన్ సడలింపుతో ప్రజలకు జగన్ సర్కార్ తీపికబురు.

ప్రస్తుతం దేశం లో లాక్ డౌన్ పటిష్టంగా అమలవుతోంది మే 3 తో లాక్ డౌన్ ముగుస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్టాలకూ కొంత సడలింపు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్టాల సీఎం లతో జరిగిన వీడియో కాన్ఫెరెన్స్ లో పలు రాష్టాలకు కొన్ని  గైడ్ లైన్స్ జారీ చేసింది.

అయితే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్స్ ఆధారంగా రాష్ట్రంలో లాక్ డౌన్ నిభందనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్ లైన్స్ లో గ్రామీణ ప్రాంతాల్లో చేసే నిర్మాణ పనులు, హార్టికల్చర్, మొక్కలు నాటటం, పవర్ లైన్స్ , టెలికాం, కేబుల్స్ పనులు, బుక్ షాప్స్, ఈ కామర్స్ డెలివరీ, మరియు వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు వెళ్లి పనులు చేసుకునే వీలుకల్పిస్తుంది.

అయితే ఈ గైడ్ లైన్స్ కరోనా అనుమానిత వ్యక్తులకు, రెడ్ జోన్ లో ఉన్న వారికి మాత్రం ఎటువంటి సడలింపులూ ఉండవు. వలస కార్మికులు మాత్రం ఒకసారి తమ రాష్టాలకు వెళ్ళిన తరువాత అదే రాష్ట్రం లో మాత్రమె పని చేసుకునే వీలుంటుంది. ఇక మాల్స్, సినిమా దియేటర్స్ వంటి వాటికి సడలింపులు ఉండవు.

ప్రస్తుతం రాష్ట్రం లో రెండు రోజులుగా విపరీతంగా కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. ఈరోజు ఒక్క రోజే సుమారు 40 కి పైగా కేసులు నమోదవ్వడంతో ఒక్కసారిగా అధికారులు ఎలర్ట్ అయ్యారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అత్యధిక కరోనా టెస్టులు చేసి ఈ మహమ్మారిని ఏదోవిధంగా అంతమొందిచి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చూస్తోంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular