శుక్రవారం, మార్చి 31, 2023
Homeజాతీయంలాక్ డౌన్ 5.0 లో వీటికి సడలింపులు...విద్యా సంస్థలు తెరుచుకునేది అప్పుడే

లాక్ డౌన్ 5.0 లో వీటికి సడలింపులు…విద్యా సంస్థలు తెరుచుకునేది అప్పుడే

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 పూర్తికావడంతో నేటి నుండి లాక్ డౌన్ 5.0 ని తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. లాక్ డౌన్ 4.0 లో ఇచ్చిన సడలింపులతో పాటు మరిన్ని సడలింపులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకూ ఉదయం 6 నుండి సాయంత్రం 6వరకూ ఉన్న కర్ఫ్యూ సాయంత్రం 9గంటల వరకూ పొడిగించింది. దీనితో పాటు మరిన్ని సడలింపులు ఇస్తూ జూన్ 30 వరకూ లాక్ డౌన్ పొడిగించింది.

అయితే జూన్ 8నుండి హోటల్స్ రెస్టారెంట్లు, మాల్స్, తో పాటు ఆలయాలు కూడా తెరిచేందుకు అనుమతించింది. అయితే రాత్రి వేళల్లో కర్ఫ్యూ లో కొద్దిగా మార్పులు చేసి రాత్రి 9 నుండి ఉదయం 5గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. ఇక సడలింపులు ఇవ్వని వాటిలో మెట్రో రైళ్ళు, సినిమా హాళ్ళు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ లు, పార్కులు, బార్ లు, పబ్బులతో పాటు త్వరలో ఓపెన్ కావాల్సిన విద్యాసంస్థలకు కూడా మినహాయింపు ఇవ్వలేదు.

ప్రస్తుతం ఇచ్చిన సడలింపులు జూన్ 8 నుండి కొనసాగనున్నాయి. అయితే నిత్యావసర సరుకులు, మరియు ప్రాజా రవాణా మొదలగు రాకపోకలకు తమ రాష్ట్రం వరకూ ఎటువంటి అనుమతి తీసుకోనవసరం లేదని సూచించింది. అయితే నిషేధం ఉన్న వాటిపై ఫెజ్ ల వారీగా నిషేదాన్ని ఎత్తివేసే చర్యలు తీసుకోబోతోంది.

మరికోన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకోబోతుంది. వీటిలో మొదటగా రాష్ట్రంలో విద్యాసంస్థలను మాత్రం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించిన తరువాత మాత్రమే ఓపెన్ చెయ్యలా లేదా అనే నిర్ణయానికి రానుంది. అయితే ఈ నిర్ణయం మాత్రం జూలై లో మాత్రమే తీసుకునే అవకాసం ఉన్నట్లు తెలిస్తుంది.

RELATED ARTICLES

Most Popular