కోస్తాఆంధ్రాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం

0
213
weater report in ap
weater report in ap

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనివల్ల రాగల 48 గంటల్లో రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. రాగల 48 గంటల్లో రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందునా… పసిపిల్లలు, వృద్ధులు జాగ్రత్త వహించాలని చెప్పారు.

వచ్చేనెల మొదటి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లండించింది. కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్​ కె.కన్నబాబు సూచించారు.