ఆదివారం, జూలై 21, 2024
Homeజాతీయంమురికినీటి నమూనాలతో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు ఇలా..

మురికినీటి నమూనాలతో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు ఇలా..

ప్రస్తుతం ఉన్న కరోనా లెక్క తేల్చాలన్నా దాన్ని పూర్తిగా దేశవ్యాప్తంగా కట్టడి చెయ్యాలన్నా ఉన్న ఒకే ఒక్క మార్గం కరోనా పరీక్షలు అదికంగా పెంచడం. యావత్ ప్రపంచం ముందున్న సవాల్ ఇదొక్కటే ఈ విషయాన్నే నేడు ఎక్సపర్ట్స్ కూడా పదే పదే చెబుతున్న మాట కొవిడ్-19 మహమ్మారి తీవ్రతను పూర్తిస్థాయిలో మనం  తెలుసుకునేందుకు ఇదిఒక్కటే గొప్ప మార్గం.

కానీ  ఎక్కువజానాభా ఉన్న  దాదాపు 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత్​లో ప్రతి ఒక్కరికీ  కరోనా పరీక్షలు చెయ్యడం సాధ్యమా అంటే ఇప్పుడు వినిపిస్తోంది. మనలాంటి జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో కరోనా తీవ్రతను పక్కాగా కనుక్కునేందుకు  ఓ మార్గం ఉందంటున్నారు పరిశోధకులు. ఇదెలా అనగా  ఓ ప్రాంతంలోని మురికి నీరులోని వ్యర్థాలను పరీక్షించి అక్కడి సమూహం మొత్తానికి వైరస్ సోకిందో లేదో నిర్ధరణకు రావచ్చని చెబుతున్నారు.

కొవిడ్-19 ఇప్పుడు ప్రపంచాన్ని  ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. ఒక్క చైనాలో మాత్రమే ఈ వైరస్ నాలుగో దశకు చేరింది. ఈ దశ చాలా ప్రమాదకరం. ఈ దశలో వైరస్ నియంత్రించలేని స్థాయికి చేరుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 65 వేల మందికి పైగా ప్రజలను బలిగొన్న ఈ మహమ్మారి.. భారత్​లో ఇది అంత వేగంగా విస్తరించడంలేదు కాబట్టి ఇది కాస్త ఊరటనిచ్చే అంశం.

ఒకవేళ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో వైరస్ మూడో స్టేజీకి చేరితే ప్రభుత్వాలకు కష్ట  కాలం మొదలైనట్టే. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ కరోనా పరీక్షలు చేయడం అసాధ్యం కూడా.. అయితే ఇలాంటి  పరిస్థితి తలెత్తకుండా కొందరు శాస్త్రవేత్తలు భిన్న మార్గాలను వెతుకుతున్నారు. ఓ వర్గం అంతటికీ ఒకే విధానంతో పరీక్షలు నిర్వహించేలా అడుగులు వేస్తున్నారు.

పెద్ద సంఖ్యలో ప్రజలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించే అవసరం లేకుండా ఆ ప్రాంతంలోని మురికినీరును విశ్లేషించి ఎంతమందికి వైరస్ సోకిందో అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థలో చేరే మలమూత్ర నమూనాల్లో కొవిడ్-19 ఉండే అవకాశాన్ని విశ్లేషిస్తున్నారు.

అయితే ఈ పద్దతిలో ఒక్కరిని లెక్కలోకి తీసుకోలేమని ఆ ప్రాంతం  మొత్తాన్ని అంచనావేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందని  ఆస్ట్రేలియాలోని క్వీన్స్​లాండ్ అలయన్స్​ ఫర్​ ఎన్విరాన్​మెంటల్ హెల్త్ సైన్సెస్​కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ప్రస్తుతం నెదర్లాండ్స్,యూఎస్ , స్వీడన్ దేశాల్లో ‘మురికి నీటి’ విధానాన్ని ఫాలో  అయ్యి వైరస్ జాడను గుర్తించారు. అయితే ఈ పద్దతి ద్వారా రోగ లక్షణాలు పరీక్షించడం ఎప్పటి నుంచో అమలులో ఉంది.

పోలియో వైరస్ టీకాల ప్రభావాన్ని అంచనా వేయడానికి ఈ పద్ధతిని దశాబ్దాల నుంచి ఉపయోగిస్తున్నట్లు ట్యూసన్​లోని అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ సూక్షజీవశాస్త్రవేత్త చార్లెస్ గెర్బా వెల్లడించారు. వైరస్ ను నివారించడంలో సామజిక దూరం పాటించడం చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోవడం, గుమిగూడకుండా ఉండటం చాల మంచి ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెప్పడంతో పాటు అది ప్రాక్టికల్ గా నిర్ధారణ అయింది కాబట్టి అందరు వీటిని తప్పక పాటించి కరోనాని అరికట్టాలి.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular