గురువారం, సెప్టెంబర్ 29, 2022
Homeరాజకీయంప్రభుత్వానికి భారీ విరాళం అందించిన లలితా జ్యూయలర్స్ ...కిరణ్

ప్రభుత్వానికి భారీ విరాళం అందించిన లలితా జ్యూయలర్స్ …కిరణ్

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సాదారణ ప్రజలతో పాటు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు, సినీ స్టార్స్ భారీ ఎత్తున విరాలాలో ప్రకటించారు. అయితే తాజాగా మనల్ని ఎప్పుడూ ఎడ్వర్టైజ్ మెంట్ తో విసిగిస్తున్నాడని గుండూ అంటూ తిట్టుకునే లలితా జ్యూయలర్స్ ఎండీ కిరణ్ వారం రోజుల క్రితం తెలంగాణాకు కోటి రూపాయల చెక్ ను  సీఎం సహాయనిధికి అందచేసిన కిరణ్ తాజాగా ఎపీకి కూడా కోటిరూపాయల చెక్ ను వైఎస్ జగన్ కు అందచేసారు. దీనితో సీఎం జగన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

అయితే తన గుండుతో తనే ఒక బ్రాండ్ సింబాలిక్ గా మారి ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు దేశంలో ప్రతీ నగరంలో లలితా జ్యూయలర్స్ స్థాపించే స్థాయికి ఎదిగారు. డబ్బులు ఊరికే రావు అంటూ ప్రజలకు డబ్బు విలువ తెలపడంతో పాటు గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసేలా చేస్తూ గోల్డ్ బిజినెస్ లో జరిగే మోసాలను లలితా జ్యూలర్స్ ద్వారా ప్రజలకు తెలియజేసారు. అయితే కిరణ్ మీడియాతో మాట్లాడుతూ డబ్బులు ఊరికే రావుకదా సార్..! అని అడిగిన ప్రశ్నకు డబ్బులు ఊరికే వచ్చినా రాకపోయినా ప్రాణాలు ఊరికే రావు అంటూ సమాదానం ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular