శుక్రవారం, మార్చి 31, 2023
Homeఅంతర్జాతీయంరాముడు పుట్టింది నేపాల్ లో..భారత్ లో ఉన్నది నకిలీ అయోధ్య..నేపాల్ ప్రదాని

రాముడు పుట్టింది నేపాల్ లో..భారత్ లో ఉన్నది నకిలీ అయోధ్య..నేపాల్ ప్రదాని

ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరౌతారనే సామెత మనం చాలా సార్లు వినే ఉంటాం ఇప్పుడు నేపాల్ ని చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. చైనాతో సావాసం చేసిన తరువాత నేపాల్ ప్రదాని మెదడు కాస్తా అరికాళ్ళ వరకూ వచ్చినట్లుంది. ఒక వైపు భారత్ మరియు నేపాల్ సంభందాలు క్షీనిస్తున్న తరుణంలో నేపాల్ ప్రధాని రాముడు మాదేశం వాడే అంటూ భారత్ ను రెచ్చగోట్టే ప్రయత్నాలు చేస్తోంది. రాముడు నేపాల్ లో భీర్ గంజ్ లో ఉన్న అయోధ్యలో పుట్టాడని ఉత్తరప్రదేశ్ లో ఉన్న అయోధ్యలో పుట్టినట్లు భారత్ చెప్పుకుంటుందంటూ  నేపాల్ ప్రదాని ఓలీ రాముడిపై కీలక వ్యాఖ్యలు చేసారు. అంతేకాక ఉత్తరప్రదేశ్ లో ఒక డూప్లికేట్ అయోధ్య సృష్టించి రాముడు అక్కడే పుట్టినట్లు ఇండియన్స్ చాలా తెలివిగా చెప్పుకుంటున్నారని అన్నారు.

ఈ వ్యాఖ్యలు నేపాల్ రచయిత భానుబక్త ఆచార్య  206 వ జయంతి ఉత్సవంలో ప్రదాని కేపీ ఓలీ ఈ వ్యాఖ్యలు చేసారు. భాను బక్త ఆచార్య రామాయణాన్ని నేపాలీ భాషలో అనువాదం చేసిన వ్యక్తి. తాజాగా ఓలీ చేసిన వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాలతో పాటు ప్రముఖ రాజకీయనాయకులు ఈ విషయం పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భీజేపీ నేత రాజాసింగ్ ప్రదాని కేపీ ఓలీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రధానిగా ఉన్న మీరు మీదగ్గర ఎటువంటి ఆధారాలూ లేకుండా రాముడు మావాడేనంటూ భారత్ ను రెచ్చగోట్టే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. నేపాల్ ప్రదాని భారత దేశంలో ఉన్న చరిత్ర, మందిరాలు వంటి వాటిపై మాట్లాడే ముందు నేపాల్ లో  ఉన్న పరిస్థితి ఒక్కసారి తెలుసుకొండి అంటూ నేపాల్ లో ప్రాచీనమైన ఆలయాలు ఉన్నాయని వాటి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి చెప్పాలని సూచించారు.

అంతేకాక ముక్తిదామ్, పసుపతినాద్ ఆలయం వంటి వాటి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి అక్కడికి వెళ్లి చూడాలన్నారు. కనీసం వెళ్ళడానికి సరైన రోడ్డు కూడా లేదంటూ విమర్శించారు. భారత్ నుండి ఆలయాల సందర్శనకు నేపాల్ వెళ్తే ఇక్కడి నుండి వచ్చిన వారి నుండి 10 రెట్లు అదిక ధరలు వసూలు చేస్తున్నారన్నారు. చైనా అండదండ చూసుకుని భారత్ ను రెచ్చగొడితే మిమ్మల్ని దారిలో పెట్టడం భారత్ కు పెద్ద విషయమేమీ కాదన్నారు.

ప్రస్తుతం ప్రదాని ఓలీ చేసిన వ్యాఖ్యలకు భారత్ ఏదైనా చర్యలు తీసుకుంటే వాటిని సాకుగా చూపి నేపాల్ ప్రజలను రెచ్చగొట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రదాని ఓలీ పై గత కొన్నాళ్ళుగా చైనా పన్నిన హనీ ట్రాప్ లో చిక్కుకున్నట్లు వస్తున్న వార్తలకు నేపాల్ ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలే ఆయనను ప్రదాని పదవికి రాజీనామా చెయ్యాలని పట్టుబడుతున్నారు. ఈ విషయాలను పక్కదోవ పట్టించేందుకే ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారనే అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.     

RELATED ARTICLES

Most Popular