శుక్రవారం, మార్చి 31, 2023
Homeభక్తిఖైరతాబాద్ గణేషుడు ఎత్తు ఈసారి అంతేనట...

ఖైరతాబాద్ గణేషుడు ఎత్తు ఈసారి అంతేనట…

కరోనా ఎఫెక్ట్ కేవలం ఆఫీసులకు మాత్రమే కాదు అన్ని రంగాలపై చివరికి దేవాలయాలు, ప్రార్ధనా స్థలాలపై కూడా పడటం జరిగింది. ఎక్కడివక్కడే మూతపడ్డాయి. దాదాపు రెండునెలలుగా ఇదే పరిస్థితి. ప్రస్తుతం కొన్ని సడలింపులతో మార్కెట్ లు తెరుచుకుంటున్నప్పటికీ అవి ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయి ఇలా అన్ని స్తంభించిపోయాయి.

ఇక  ప్రఖ్యాతిపొందిన హైదరాబాద్ లోని ఖైరతాబాద్  గణేషుడి విగ్రహం అంటే ఆకాశాన్ని తాకేలా ప్రతీఏటా రకరకాల రూపాలతో వినాయక చవితి పర్వదినాల్లో భక్తులను ఆశీర్వదించే గణేష్ విగ్రహం.. కానీ లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల, ప్రస్తుత పరిస్థితులవల్ల ఈ సారి ఎత్తు విషయంలో ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోనున్నారు.. ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఈ ఏడాది కేవలం అడుగుమేర ఎత్తులో ఏర్పాటు చెయ్యాలని నిర్వాహకులు నిర్ణయించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆర్ధిక పరిస్థితి బాలేనందువల్ల ఇక ఆర్ధిక విధానాలకు సంబంధించి గుణాత్మక మార్పులు అనివార్యం..ఈ నేపథ్యంలోనే ఆర్భాటాలను తగ్గించుకుని అర్ధికంగా చక్కగా ముందుకు వెళ్లాల్సిన సమయంలో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం పై ఎత్తు తగ్గించే విషయంలో కమిటీ తీసుకున్న నిర్ణయం స్వాగతించతగ్గదని అందరూ అంటున్నారు..

RELATED ARTICLES

Most Popular