తెలంగాణా సీఎం కేసీఆర్ కొంత సేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ మే 31 వరకు లాక్ డోన్ కొనసాగుతుందన్నారు. అదేవిధంగా కొన్ని సడలింపులు ఇవ్వటం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి హైదరాబాద్ సిటీలో మినహా రాష్ట్రమంతా అనుమతించడం జరిగింది ఇతర రాష్ట్రాల్లో వాహనాలు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. ఆటోలో డ్రైవర్ ఇద్దరూ ప్యాసింజర్లు, కార్లో అయితే డ్రైవర్ ముగ్గురు ప్యాసింజర్లుకి అనుమతి ఇవ్వడం జరిగింది.
అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలనీ యధావిధిగా విధుల్లో కొనసాగిస్తారు మెట్రో రైలు, షాపింగ్ మాల్స్, హోటల్స్, సినిమా హాల్స్ మే 31 వరకు మూసి ఉంటాయని ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. మాస్కు ధరించని వారికి వెయ్యి రూపాయలు జరిమానాగా వేస్తామన్నారు. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల ప్యాకేజ్ గురించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వకుండా తిరిగి దానికి ప్యాకేజీ అని పేరు పెట్టారని కేసీఆర్ అన్నారు.