గురువారం, సెప్టెంబర్ 29, 2022
Homeరాజకీయంలాక్ డౌన్ పై కేసీఆర్ ఫైనల్ మాట

లాక్ డౌన్ పై కేసీఆర్ ఫైనల్ మాట

కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ లో కీలక విషయాలు వెల్లడించారు ఇప్పటి వరకు తెలంగాణలో 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వాటిలో క్యూర్ అయినవారు 45 మందిని ఉన్నారని వాళ్ళను డిశ్చార్జ్ చేశామని తెలిపారు.. ఇక 11 మంది చనిపోయినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం 308 మంది బాధితులు సికింద్రాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స  పొందుతున్నట్టు తెలిపారు కేసీఆర్.  విదేశాల నుంచి వచ్చిన 25937 మందిని క్వారన్ టైన్ చేశాం… అందులో 50 కి మాత్రమే పాజిటీవ్ వచ్చిందని వెల్లడించారు.

విదేశాల నుంచి వచ్చిన 30 మందికి… వారి కుటుంబ సభ్యులు 20 మందికి వ్యాధి సోకిందట మర్కజ్ నుంచి వచ్చిన 1089 మంది అనుమానితుల్లో 172 మందికి పాజిటివ్ రావడం అందరిని కలవరపెట్టింది. ఇప్పుడు ఆ 172 మంది మరో 93 మందికి కరోనాని అంటించారు.

కరోనా మహమ్మారి విస్తరించకూడదంటే జూన్ 3 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని కేసీఆర్ అన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్ప వేరే మార్గం కనిపించడం లేదన్నారు. ఈ విషయమై ప్రధానితో రోజుకి రెండు సార్లు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయన్నారు కేసీఆర్.

లాక్ డౌన్ కొనసాగించాల్సిందేనని నేను ప్రధానికి తెలిపినట్లు వెల్లడించారు. ఎందుకంటే ఇది మానవ జాతి మొత్తం ఎదుర్కొంటున్న సంక్షోభమని కేసీఆర్ పునరుద్ఘాటించారు.  కరోనా వైరస్ తో  రోగులు అత్యంత దయనీయంగా చనిపోతున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

శరీరంలో తక్కువ వైరస్ సోకిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారని తెలిపారు. ఒక వేల కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసినా ఈ నేపథ్యంలో తెలంగాణాలో లాక్ డౌన్ మే 3 వరకు ఉండే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

RELATED ARTICLES

Most Popular