నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కవిత

0
33
telangana mlc election
telangana mlc election

నిజామాబాద్ :  నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ లోనే కవితకు భారీ ఆధిక్యం రాగా.. మొత్తం పోలైన ఓట్లు 823, మొదటి రౌండ్ లో కవితకు 532 ఓట్లు. మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ కి 532 ఓట్లు, బీజేపీకి 39, కాంగ్రెస్ కి 22 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్ లో టీఆర్ఎస్ 728, బీజేపీ 56, కాంగ్రెస్ 29 ఓట్లు వచ్చాయి.

అయితే మొత్తంగా టీఆర్ఎస్ కు 728, బీజేపీ 56, కాంగ్రెస్ 29 ఓట్లు రాగా.. అందులో 10 చెల్లని ఓట్లు ఉన్నాయి. విజయానికి అవసరమైన ఓట్లు సాధించడంతో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను విజేత గా ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.

ఈ మేరకు గొప్ప మెజారిటీతో కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. అయితే కరోనా కారణంగా ప్రస్తుతానికి పార్టీ ఆఫీస్ దగ్గర ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదు. కరోనా నేపథ్యంలో పూర్తిగా నిజామాబాద్ లోనే కవిత గెలుపు కి సంబదించిన స్థానిక సెలబ్రేషన్స్ జరుపుకోవాలని పార్టీ అధిష్టానం సూచించింది.