ఆదివారం, మే 26, 2024
Homeరాజకీయంకాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా .. రేవంత్ రెడ్డి పై విమర్శలు

కాంగ్రెస్ పార్టీకి కౌశిక్ రెడ్డి రాజీనామా .. రేవంత్ రెడ్డి పై విమర్శలు

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ లో రాజకీయ పరిణామాలు హీటెక్కుతున్నాయి అదికూడా రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టిన తరువాత తెలంగాణాలో రాజకీయం సమీకరణాలు మరింత మారుతున్నాయి. ఒక వైపు సొంత పార్టీలోని అసమ్మతి నేతల బాగోతాలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి.

“హుజూరా బాద్ ఎలక్షన్ లో టీఆర్ఎస్ వైపు నుండి నాకు టికెట్ లబించింది కాకపోతే మీ హెల్ప్ నాకు కావాలి ఇక డబ్బు విషయం నాకు వదిలేయండి” అంటూ కౌశిక్ రెడ్డి పేరుతో సోషల్ మీడియాలో ఈ వాయిస్ రికార్డ్ తెగ హల్చల్ చేస్తుంది. తాజాగా కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ వ్యవహారం బయట పడడంతో ఆయనపై టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చర్యలకు దిగింది దీనిలో బాగంగానే కౌశిక్ రెడ్డి కి షోకాజ్ నోటీస్ జారీ చేసింది.

ఇప్పటికే కౌశిక్ రెడ్డి పై పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే వదంతులు చాలానే ఉండడం, ఆయనపై పలు పిర్యాదులు కూడా పార్టీ అధీస్టానానికి రావడంతో రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకునారు. దీనిలో బాగంగా ఇప్పటి ఆడియో లీక్ తో పాటు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్లు వచ్చిన పిర్యాదులపై 24 గంటల్లో సమాధానం చెప్పాలని క్రమశిక్షణ సంఘం ఆ లేఖలో పేర్కొంది.

అయితే నోటీస్ ఇచ్చిన 24గంటల్లో  కౌశిక్ రెడ్డి తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. తను రాజీనామా చేస్తూ తనను కాంగ్రెస్ పార్టీ అస్సలు పట్టించుకోలేదంటూ రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. 50కోట్లకు టీపీసీసీ పదవిని కొనుకున్నారంటూ దుయ్యబట్టారు. అంతేకాక తెలంగాణాలో కాంగ్రెస్ మనుగడ సాగించడం అసాధ్యమని విమర్సించారు.            

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular