ప్రముఖ నటుడు మరియు క్రిటిక్ అయిన కత్తి మహేష్ గత కొన్ని రోజుల క్రితం నెల్లూరు హైవే పై లారీని వెనకనుండి డీకొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అయితే కత్తి మహేష్ ను కంటి సర్జరీ కోసం చెన్నై తీసుకువెళ్ళారు అక్కడ ఆయన కంటికి చస్త్ర చికిత్స చేసారు. అప్పటికే కత్తి మహేష్ ఒక కన్ను పూర్తిగా దెబ్బతింది.
అయితే యాక్సిడెంట్ సమయంలో ముఖానికి తీవ్రంగా గాయాలవడంతో ఇప్పటి వరకూ ఆయనకు ఐసీయూ లో వైద్యం అందిస్తున్నారు. అయితే కత్తి మహేష్ కు ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువవడంతో పలు చస్త్ర చికిత్సలు చెయ్యాల్సి వచ్చింది. కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఆయనకు 17లక్షల రూపాయల ఆర్ధిక సాయం చేసింది. అయితే నేడు కత్తి మహేష్ ఆరోగ్యం పూర్తిగా క్షీనించడంతో కొద్దిసేపటి క్రితం ఆయన మరణించినట్లు విషయాన్ని వైద్యులు దృవీకరించారు.
WhatsApp Group
Join Now