సోమవారం, నవంబర్ 28, 2022
Homeరాజకీయంఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్ కు మద్దతుగా జగన్ మోహన్ రెడ్డి..!

ఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్ కు మద్దతుగా జగన్ మోహన్ రెడ్డి..!

ఫెడరల్ ఫ్రంట్ కోసం బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ కలుపుకొని జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతామని కేసిఆర్ కొన్నాళ్ళ క్రితమే ప్రకటించారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచి మళ్లీ అధికారంలోకి రావడంతో కేసీఆర్ ప్రకటించిన ఫెడరల్ ఫ్రంట్ పై ఇప్పుడు తెలుగు మరియు ఇతర రాష్ట్రాలలో రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ ఫ్రంట్ లో ఉండేవారిపై చర్చ జరుగుతోంది. కేసీఆర్ కు తోడుగా ఎంఐఎం అదినేత మొన్నటి ఎలక్షన్ లో కలిసి పోటీచేశారు కనుక అసదుద్దీన్ ఓవైసీ కెసీఆర్ ఫ్రంట్ లో ఉంటారని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేసీ ఆర్, జగన్ ల మధ్య ఈ విషయమై ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. అయితే త్వరలో ఆంధ్రాకు ఎన్నికల కారణంగా జగన్ దీనిపై ఇప్పుడే స్పందించరని విశ్లేసకులు చెబుతున్నారు.

కొన్నాళ్లుగా జగన్ బీజేపీ కి మద్దతు ఇస్తారనే వార్తలు వినిపించాయి కాని ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకు పూర్తిగా విబిన్నంగా ఉండడంతో ఈ ప్రక్రియను పూర్తిగా వాయిదా వేశారు. కావున జగన్ కేసీఆర్ ఫ్రంట్ లో భాగంగా ఉంటారని సమాచారం.

తాజాగా జరిగిన ఎన్నికలలో చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించాలని చూడడంతో కేసీఆర్ ఓపక్కాన గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఎన్నికలలో పూర్తి మెజార్టీతో గెలుపొందడంతో ఇప్పుడు చంద్రబాబు, కాంగ్రెస్ లకు కలిపి ఒకేసారి ఫెడరల్ ఫ్రంట్ తో షాక్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫ్రంట్ లో జగన్ ను కలుపుకోవడంతో పని మరింత సులువౌతుందని కేసీఆర్ భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular