ఇంగ్లీష్ మీడియం పై జగన్ సర్కార్ సమగ్ర సర్వే

0
241
jagan government survey for English medium
jagan government survey for English medium

ఆంద్రప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియంలో విధ్యాబోదనను తప్పనిసరి చేస్తూ ఇచ్చిన జీవో ను హైకోర్టు కొట్టేయడంతో ఈ విషయంపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ద్రుష్టి సారించింది ఇప్పుడు దీనిని సుప్రీమ్ కోర్టుకు తీసుకెళ్ళే తరుణంలో ఏపీ ప్రభుత్వం 2020-2021 విద్యా సంవత్సరంలో 1 నుండి 5వ తరగతి చదివే పిల్లల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకుల  నుండి అభిప్రాయ సేకరణ చెయ్యాలని యోచిస్తోంది.

దీనిపై ఇప్పటికే పాఠశాల కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాబిప్రాయాలు వ్యక్తమవురున్నాయి. తాను చదవాలనుకున్న మీడియాన్ని విద్యార్ధి ఎంచుకుని చదవడం ప్రతీవిద్యార్ది హక్కు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయడంతో తాను చదవాలనుకునే మీడియం లేకపోవడంతో విద్యార్ధి చదువు మానివేసే అవకాసం ఉంది.

ప్రభుత్వ నిర్ణయం తో తెలుగు పై అశ్రద్ద చూపడం వళ్ళ అది మరుగున పడిపోయే అవకాశంఉందని పలువురు దీనిపై పెదవివిరుస్తున్నారు. కొంతమంది ఇంగ్లీష్ ను తప్పనిసరి చేయకుండా ఆ చాయిస్  తల్లి తండ్రులకే ఇవ్వాలని కోరుతున్నారు.

అయితే ప్రతిపక్ష నేతలు మాత్రం ప్రబుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పబ్లిసిటీస్టంట్ అని జగన్ కు ఈ విషయం పై చిత్తశుద్ది లేదని ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న టీచర్స్ చాలామంది తెలుగు మీడియం బోదిస్తుంటే ఒకే సారి వారితో ఇంగ్లిష్ మీడియం ఎలాచేప్పిస్తారని , దీనివల్ల పిల్లల భవిషత్తు అగమ్య గోచరంగా మారుతుందని, తెలుగు    మీడియం చెప్పే టీచర్స్ ఇంగ్లిష్ మీడియంలో కి చెప్పాలంటే వారికి కొన్ని నెలలపాటు వారికి శిక్షణ ఇవ్వాలని కోరుతునారు.