ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తారా జగన్ ఫైర్

0
160
జగన్
జగన్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోవిడ్ 19 ఉదృతి ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే అయితే కొన్నిరోజుల క్రితం ఢిల్లీలోని ఒక మతానికి సంబంధించి జరిగిన ప్రార్థనలకు వందల మంది ఆ సమావేశానికి హాజరయ్యారు ఆ సమావేశంలో వీదేశాలనుంచి కూడా చాలామంది మత ప్రభోదకులు అక్కడికి రావడంతో వారికి కరోనా ఉండటంతో అక్కడికి హజరైన వాళ్లల్లో చాలామందికి సోకిందని జగన్ తెలిపారు. ప్రార్థనల అనంతరం తిరిగి వారు వాళ్ల స్వరాష్ట్రలకు రావడం అది వేరేవాళ్లకు సోకడం ఇదంతా చాలా దురద్రుష్టకర విషయమన్నారు జగన్. దీన్ని కేవలం ఆ వర్గానికి చెందినవారి తప్పిదంగా మనం చూడకూడదని తెలిపారు.

కరోనా అనేది ఒక కులం, మతం చూసి రాదని కులంతో మతంతో మరే ప్రాంతంతో దానికి సంబంధం ఉండదని ఆయన అన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తిని ఒకే వర్గానికి చెందిన తప్పిదంగా దీనిని చిత్రీకరించడం తగదన్నారు. దేశంలో ఏ మాతానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా  ఎవరైనా జరుపుకోవచ్చని జగన్ పేర్కొన్నారు. నిజాముద్దీన్ సంఘటన ఒక దురద్రుష్టక ఘటన మాత్రమేనని దాన్ని దురద్రుష్టకర సంఘటనగా మాత్రమే చూడాలని తెలియజేసారు.