శుక్రవారం, మార్చి 31, 2023
Homeఅంతర్జాతీయంఅందరికీ ఇంటర్నేషనల్ డాన్స్ డే శుభాకాంక్షలు

అందరికీ ఇంటర్నేషనల్ డాన్స్ డే శుభాకాంక్షలు

నేటి తరంలో డాన్స్ అంటే యువతలో మంచి పాపులారిటీ ఉంది కొంత మంది దీనిని సోషల్ మీడియాలో ఉపయోగించుకుంటున్నారు మరికొంతమంది దీనిని వారి జీవితంలో బాగంగా ప్రదర్శిస్తున్నారు. ఏదేమైనా డాన్స్ పై రాబోయే రోజుల్లో మరింత ఆశక్తి కనభరిచే చాన్స్ బాగా ఎక్కువే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 ను అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటారు.

డ్యాన్స్ అనేది  ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం. యునెస్కో ఆచారం ప్రకారం ప్రతీ కళలకు వాటి పరిధిలో  ఒక రోజు కేటాయిస్తారు. దీనిలో భాగంగానే ప్రతీ ఏడాదీ అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటారు. 1982 నుండి అంతర్జాతీయ నృత్య దినోత్సవం కొద్ది కొద్దిగా ప్రాచుర్యం పొండుతూ వస్తోంది. అప్పటి నుండి, అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలలో  ఎంతో ఉత్సాహంతో నిర్వహిస్తుంటారు.

ప్రతీ ఒక్కరి జీవితంలో డాన్స్ అనేది ఇష్టమే కానీ కొందరు సిగ్గువల్ల కళను బయటపెట్టలేరు. డాన్స్ లో పలు రూపాలు ఉన్నాయి. ప్రతీదేశాన్ని బట్టి అక్కడి వారి చేసే నృత్య రూపం మారుతుంటుంది. 

ప్రదానంగా నృత్యం అనేది ఒత్తిడిని, బాధలను కోపాన్ని దూరం చెయ్యడానికి ఒక చక్కని మార్గం. అనేక  సార్లు డాన్స్  మనకి ఒక  మంచి స్నేహితుడు కూడా మారితుంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిగాంచిన సుమారు 20 రకాల నృత్య రూపాలు మీకు తెలుసా అవేంటో ఒక్కసారి చూద్దాం పదండి.

ప్రపంచంలో ప్రసిద్దిగాంచిన డాన్స్ ల పేర్లు :

 1. బ్యాలెట్( Ballet), 2. భరత నాట్యం (Bharata Natyam), 3. కథక్ (Kathak), 4. బ్రేక్ డాన్స్ (Break Dance), 5. లయన్ డాన్స్ Lion dance, 6.  కబుఖి (kabuki), 7. సాల్సా (Salsa) , 8. వాల్ట్ (Waltz) 9. టాప్  డాన్స్ (Tap dance) ,10. బెల్లీ డాన్స్ (Belly dance),

11. స్విన్గ్(Swing) 12. ఏరియల్ డాన్స్ (Aerial Dance) 13. టాన్గో (Tango), 14. ఫాన్డన్గో (Fandango),. 15. లాటిన్ డాన్స్ (Latin Dance), 16. కాన్ ఖాన్ ( Can can) , 17. ఇరానియన్ డాన్స్ (Iranian Dance) 18. అజర్బేజాన్ డాన్స్ (Azerbaijani Dance) , 19. డిస్కో డాన్స్ (Disco Dance) & 20. ఫోక్ డాన్స్ (Folk dance)

ప్రజావారధి వ్యూవర్స్ అందరికీ ఇంటర్నేషనల్ డాన్స్ డే శుభాకాంక్షలు. నృత్యం ఆరోగ్యం ఆనందం.

RELATED ARTICLES

Most Popular