గురువారం, జూన్ 8, 2023
Homeఅంతర్జాతీయం72 వేల అసాల్ట్ రైఫిల్స్ కొనుగోలుకు భారత ఆర్మీ భారీ ఒప్పందం

72 వేల అసాల్ట్ రైఫిల్స్ కొనుగోలుకు భారత ఆర్మీ భారీ ఒప్పందం

భారత రక్షణ రంగ బలోపేతానికి  మరొక కీలక అడుగు ముందుకు పండింది 72 వేల అసాల్ట్ రైఫిల్స్ కోసం 700 కోట్ల రూపాయలతో అమెరికాతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి ప్రధాన కారణం పాక్ చైనా కవ్వింపు చర్యలే కారణం ఒకవైపు పాకిస్థాన్ సరిహద్దుల్లో పాక్ విచక్షినా రహితంగా కాల్పుల ఉల్లంగనకు పాల్పడుతుంటే చైనా డొక్లాం వద్ద ఉద్రిక్తతలను పెంచుతుండటం మరొక కారణం.

Indian army purchase assault rifles

పాకిస్థాన్ సరిహద్దుల్లో పహారా కాస్తున్న భారత భాలగాలకు ఎప్పటినుంచో సరైన ఆయుధాలు లేకుండా పోయాయి. ఇప్పటిదాకా అక్కడి భారత బలగాలు పాతతరం ఇన్సాస్ రైఫిళ్లను వాడుతున్నాయి. ఇప్పుడు వాటిస్థానంలో కొత్తతరం అసాల్ట్ రైఫిల్స్ రానున్నాయి. 2017-2018 ఆయుధ సమీకరణలో భాగంగా ఈ ఒప్పందం ప్రారంభించింది.

వీటితో పాటు దేశీయంగా తయారు చేసుకునే ప్రక్రియలో భాగంగా 3 బిలియన్ డాలర్ల వ్యయంతో 111 హెలీకాఫ్టర్లను తయారు చేసేందుకు టెండర్లను పిలవనుంది. నిఘా మరియు రక్షణ కోసం ఇజ్రాయెల్ నుంచి 54 శక్తివంతమైన డ్రోన్లను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది

RELATED ARTICLES

Most Popular