తాజాగా ఇండియా టుడే నిర్వహించిన సర్వే లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి షాకింగ్ ఫలితాలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత సంవత్సరం ఇండియా టుడే చేసిన సర్వేలో జగన్ కు నాలుగో స్థానం ఇచ్చింది. అయితే అదే ఫలితాలు వచ్చి సవత్సరం గడవకముందే మొదటి పది స్థానాల్లో కూడా ఎక్కడా జగన్ పేరు భూతద్దంలో పెట్టి వెతికినా కనిపించడంలేదు.
ఇక మొదటి స్థానం తాజాగా భాద్యతలు చేపట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్ కు దక్కింది ఈయనకు నలభై రెండు శాతం ప్రజలు మద్దతు లబించింది. స్టాలిన్ తరువాత నవీన్ పట్నాయక్, పినరయి విజయన్, ఉద్దావ్ థాక్రే, పచ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తరువాతి స్థానాలలో కొనసాగుతున్నారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకూ నవరత్నాలే తనను కాపాడతాయని సంక్షేమ పధకాల పేరుతో రాష్ట్ర ఆదాయంపై ఫోకస్ చేయకుండా ప్రజలకు ఉచిత పధకాలను పంచి పెడుతూ వస్తున్నారు దీనికి గాను రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఎక్కడ లేని కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు తీసుకు వచ్చి సంక్షేమ పధకాలను అమలు చేస్తుండడం జగన్ గ్రాఫ్ పతనానికి ఒక కారణంగా అబిప్రాయ పడుతున్నారు.
ఇక పాలనా పరమైన అంశాల్లోనూ జగన్ పై ప్రజా వ్యతిరేకత ఎలా ఉందో ఈ సర్వే ద్వారా వెల్లడైంది. ఇండియా టుడే నిర్వహించిన ఈ సర్వే ప్రధానంగా ప్రజాబిప్రాయ సేకరనతో కొనసాగుతుంది దీనిలో కరోనా పై బాగా పోరాడిన ముఖ్యమంత్రులపై కూడా ఈ సర్వే కొనసాగుతుంది గతంతో పోలిస్తే ఆ సర్వేలోకూడా జగన్ కు మిశ్రమ ఫలితాలే లభించాయి.
Read more…
- ఇకపై ప్రభుత్వ జీవోలు ఆన్లైన్లో పెట్టకూడదంట… దీని ఆంతర్యం అదేనా
- తాలిబన్ల ఆక్రమణతో.. దేశం విడిచిపెట్టి పారిపోయిన ఆఫ్ఘన్ అద్యక్షుడు అష్రఫ్ ఘని
- నారా లోకేష్ అరెస్ట్.. గుంటూరులో ఉద్రిక్తత… పోలీసుల తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం