బుధవారం, అక్టోబర్ 4, 2023
Homeజాతీయంరక్షణ రంగ వ్యయంలో టాప్ 3 గా భారత్

రక్షణ రంగ వ్యయంలో టాప్ 3 గా భారత్

రక్షణ రంగాన్ని పటిష్ట పరిచే చర్యల్లో భాగంగా భారత్ తన రక్షణ రంగ వ్యయాన్ని ప్రతీ సంవత్సరం పెంచుకుంటూ పోతుంది. 2019-20 కి గాను 3.19 లక్షల కోట్లు రక్షణ రంగానికి కేటాయించారు. సోమవారం నాడు SIPRI (Stockholm International peace research institute) ఇచ్చిన రిపోర్ట్ లో ఇండియా రక్షణ రంగానికి అత్యధికంగా ఖర్చు చేస్తున్న ప్రపంచ దేశాలలో భారత్ ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుందని తన నివేదికలో వెల్లడించింది.

ప్రస్తుతం మొదటి స్థానంలో అమెరికా ఉండగా తరువాతి స్థానంలో చైనా కొనసాగుతుంది. ఇప్పుడు వీటిసరసన భారత్ వచ్చి చేరింది. SIPRI ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2018-19 డిఫెన్స్ బడ్జెట్ తో పోల్చితే 2019-2020 డిఫెన్స్ బడ్జెట్ 6.8% పెంచినట్లు తెలిపింది.

ఒక పక్క చైనా మరోపక్క పాకిస్థాన్ లతో పొంచి ఉన్న ముప్పు కారణంగా మన రక్షణ రంగ వ్యవస్థను ఆధునీకరించడం చేత మనం ప్రతీ సంవత్సరం రక్షణ రంగ బడ్జెట్ పెంచుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుత పరిస్థితిలో పాకిస్థాన్ ను భారత్ సునాయాసంగా నిలువరించగలదు.

అయితే పాకిస్థాన్ కు మిత్రదేశమైన చైనా ఇండియాను దెబ్బకొట్టడానికి పాకిస్థాన్ ను కూడా ఉసిగొల్పుతుంది అయితే భారత్ మాత్రం ఒక్కసారిగా రెండు దేశాలు వచ్చినా నిలువరించే స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో రక్షణ రంగ బడ్జెట్ పెంచుతుంది. 2019 సంవత్సరంలో ప్రపంచ రక్షణ రంగ బడ్జెట్ సుమారు 1917 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ బడ్జెట్ చివరి 30 సంవత్సరాల బడ్జెట్ లో ఇదే అధికం.

భారత్ 2019 రక్షణ బడ్జెట్.. జీడీపీ తో పోల్చితే  2.4  గా ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితిలో పలు దేశాలతో పోల్చితే భారత్ రక్షణ రంగ బడ్జెట్ చాలా తక్కువ. అతి చిన్న దేశాలు సైతం డిఫెన్స్ బడ్జెట్ ఆయా దేశాల మొత్తం బడ్జెట్ లో నుండి 4.5 వరకూ కర్చు చేస్తున్నాయి.

అయితే భారత్ మాత్రం తన బడ్జెట్ లో ఎక్కువ డెవలప్మెంట్, ఆరోగ్యం, అక్షరాస్యత, వ్యవసాయ ఆధారిత వ్రుత్తులు, పెన్షన్ వంటి అనేక రంగాలకు కేటాయిస్తుండడంతో రక్షణ రంగ బడ్జెట్ లో కోత విదించాల్సి వస్తుంది. మనదేశం ప్రతీ సంవత్సరం విడుదల చేసే డిఫెన్స్ బడ్జెట్ లో చాలా వరకూ రిటైర్డ్ ఆర్మీ ఫెన్సన్స్, రిజర్వడ్ బెటాలియన్ , వంటి వాటికి కూడా దీనిలోని భాగమే.

ప్రస్తుతం భారత్ రష్యా నుండి ఎస్ 400, ఫ్రాన్స్ నుండి రాఫెల్ వంటి అత్యాధునిక ఆయుదాలను సమకూర్చుకుంటోంది ఒక్క సారి ఇవి మన చేతికి వస్తే పాకిస్థాన్, చైనా ల తోక జాడింపులు ఇక కుదరవు. ఇవే కాక అమెరికా తో క్షిపనులు, డ్రోన్ల కొనుగోలు కూడా చేస్తోంది.

అయితే పాకిస్థాన్ 2010 వరకూ తన బడ్జెట్ 3.4 % ఖర్చు చేసేది అయితే  2019 లో 4% కు చేరుకుంది. పాకిస్థాన్ లో ప్రస్తుతం కరువు విలయ తాండవం చేస్తుంది ప్రస్తుతం పాకిస్థాన్ ఎకానమీ పూర్తిగా కుదేలైంది అయితే పాకిస్థాన్ మాత్రం విద్య, ఆరోగ్యం , పేదరికం వంటి వాటిపై ఖర్చు చేయకుండా భారత్ ను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతో చైనా నుండి ఆయుధాలు క్షిపనులకు సమకూర్చుకుంటుంది.

WhatsApp Group Join Now
RELATED ARTICLES
- Advertisment -

Most Popular