భారత్ –చైనాల మద్య ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు దేశాల మద్య నిన్న మేజర్ స్థాయి అధికారులు సమావేశమయ్యారు అయితే ఈ చర్చల ప్రాదాన అంశం బయటికి తెలపకపోవడంతో కొన్ని మీడియా సంస్థల నుండి వెలువడిన సమాచారం ప్రకారం భారత్ లో జరిగే రోడ్డు నిర్మాణ కార్యక్రమాలు మరియు వంతెనలు, కాశ్మీర్ లో యుద్ద విమానాల లేండింగ్ వంటి పనులను పూర్తిగా ఇప్పటికిప్పుడే ఆపేయాలని లేకపోతే స్టాండ్ ఆఫ్ ఇలాగే కొనసాగుతుందని చైనా కొన్ని నిబందనలను భారత్ కు విదించడంతో భారత్ వాటిని తిరస్కరించింది.
ప్రస్తుతం భారత్ చేపడుతున్న నిర్మాణాలు తమ భూబాగంలోనే జరుగుతున్నాయని, ఎటువంటి వివాద భూబాగంలో లేవని ఇవి ఎప్పటి నుంచో ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపింది. సుమారు 6 గంటలపాటు చర్చలు కొనసాగాయి. ఈ చర్చలు సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని రెండు దేశాలు తెలిపినా చైనా మాత్రం ఈ చర్చలు జరిగిన కొంత సమయానికే నక్క జిత్తుల చైనా తన వక్ర బుద్దిని బయటపెట్టింది.
అదే రోజు రాత్రి బారీ స్థాయిలో ఆర్మీ బలగాలను , పారాట్రూపర్స్, అర్మేడ్ వెహికిల్స్, మిస్సైల్ బ్రిగేడ్స్, యుద్దట్యాంకులతో బోర్డర్ కి అతి సమీపంలో యుద్ద విన్యాసాలు చేసింది. కొంత మంది ఆర్మీ బలగాలను హై ఆల్టిట్యూడ్ ప్రదేశాలలో బలగాలను మోహరించింది. దీనిలో రాత్రిసమయాలలో యుద్దానికి కావాల్సిన వెపెన్స్ వాడినట్లు తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ప్రక్రియను ఆదేశ ఆర్మీ ఒక వీడియో రూపంలో చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ దీనిని చూపిస్తూ తమ బలం, భలగం ఇదేనంటూ భారత్ ను ఎక్కిరించే ప్రయత్నం చేసింది.
అయితే దీనిలో మనం ఒక విషయం గమనించాలి ప్రస్తుతం చైనా అన్నా చైనా అద్యక్షుడన్నా మొత్తం ప్రపంచం చీకొట్టే పరిస్థితి నెలకొంది. చాలా దేశాలు భాహాటంగానే చైనా ను విమర్శిస్తుండటం మరియు ఆదేశంలోని ప్రజల్లో అసహనం నెలకొనడంతో ఎలాగైనా భారత్ పై తమ బల్లాన్ని ప్రదర్శిస్తే తమ దెస ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు నోరుమేదపవన్న దిశగా చైనా చర్యలు మొదలుపెట్టింది.
అయితే దీనిని అదునుగా తీసుకుని పాకిస్థాన్ చైనాను భారత్ పైకి ఉసిగొల్పుతుంది. దీనికి నిదర్శనం అక్కడి మీడియాలో మొదట్లో భారత్ బోర్డర్ లో పెద్దగా ఆర్మీ ని మొహరించని సమయంలో పాకిస్థాన్ మీడియాలో భారత్ అత్యధికంగా బోర్డర్ లో ఆర్మీ ని దింపిందని, యుద్దట్యాంకులతో భారత్ యుద్దానికి కాలు దువ్వుతుందని చైనాకు సలహాలు ఇవ్వడం మొదలు పెట్టింది.
అయితే గత కొద్ది రోజులుగా భారత్ బోర్డర్ దాటి లోనికి వచ్చిన కొంత మంది పాకిస్థాన్ ఉగ్రవాద పందులను భారత్ ఆర్మీ కాల్చి చంపడంతో ఈ విషయాన్ని మాత్రం తెలియనట్టు మౌనంగా కూర్చుంది. అంతేకాక భారత్ బోర్డర్ లో అమెరికాకు సంబందించిన వరల్డ్ లో టాప్ బెస్ట్ పెట్రియాట్ మిస్సైల్ సిస్టం ను లద్దాక్ లో మొహరిస్తుందని పాకిస్థాన్ మీడియా కోడై కూస్తుంది. అయితే దీనిపై భారత్ అధికారులు గాని అమెరికా గాని ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాక పోతే అమెరికా తమ మిత్ర దేశాల సాయం కోసం కొన్ని దేశాలకు తమ మిస్సైల్ సిస్టం అందించింది.
ప్రస్తుతం అమెరికా దక్షిణ కొరియాకు ఈ క్షిపణి నిరోధక వ్యవస్థను ఎప్పటినుంచో అందిస్తుంది. అలాగే ఇంకొన్ని దేశాలకు కూడా అందించింది. అయితే భారత్ కు కూడా అందించే అవకాశాలు ఉన్నాయి. కాని ప్రస్తుతం పాకిస్థాన్ మాత్రం ఈ విశయాన్ని తెరపైకి తీసుకురావడానికి గల కారణం ఈ సాకుతో చైనా తన బలగాల సంఖ్య పెంచి ఏదోవిధంగా భారత్ పై యుద్ధం మొదలు పెడితే తాము కూడా చేరి భారత్ ను నాశనం చెయ్యాలనే దురుద్దేశంతో ఈ పన్నాగాలు పన్నుతుందని విశ్లేషకుల వాదన. అయితే భారత్ మాత్రం తాము ఎదురునిలిచే పోరాడతామని ఎట్టి పరిస్థితిలో ఏ దేశం ముందూ తలదించబోమని రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్ సైతం గట్టి వార్నింగ్ ఇచ్చారు.
Read also….
- చైనాకు కౌంటర్ గా బోఫోర్స్ గన్స్ తో బోర్డర్ లో మోహరించిన భారత్
- చినూక్ వచ్చింది …ఇక చైనా చచ్చింది