శుక్రవారం, మార్చి 31, 2023
Homeఅంతర్జాతీయంఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యం.. ఒక్క ఇంచు కూడా మీకు ఇవ్వం..భారత్

ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యం.. ఒక్క ఇంచు కూడా మీకు ఇవ్వం..భారత్

కరోనా వైరస్ ప్రపంచం మొత్తం ప్రబలడానికి ముఖ్య కారణం చైనా అంటూ ప్రపంచదేశాలు చైనా పై విరుచుకు పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) సదస్సులో చైనా లోని ఊహాన్ ప్రాంతానికి శాస్త్రవేత్తల బృందాన్ని పంపి అక్కడ పరిశోధనలు జరిపి కరోనా కృత్రిమంగా చైనా పరిసోదనలు చేసినట్లు తేలితే చైనా పై పలు ఆంక్షలు విదిస్తామని అమెరికా పేర్కొనడం దీనికి అనేక దేశాల మద్దతు లబించడం మరియు భారత్ సైతం దీనికి ఓకే చెప్పడంతో చైనా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలాకలాగా తయారైంది.

దీనితో పాటు అమెరికా తన కంపెనీలను అక్కడినుంచి వచ్చి భారత్ లో తమ యూనిట్లను నెలకొల్పాసిందిగా బహిరంగంగానే చెప్పడంతో జపాన్ సైతం చైనా లో ఉన్న తమ కంపెనీలను భారత్ కి తరలించేదుకు ప్రయత్నాలు చేస్తుండటం చైనా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

ఎలాగైనా భారత్ కు కంపెనీలు వెళ్ళిపోకుండా ఉండేందుకు ఒక పక్క పాకిస్థాన్ ను పాములా వాడుకుంటే మరోపక్క నేపాల్ ను భారత్ వైపు ఎగదోస్తుంది. నేపాల్ కు భారత్ ను తట్టుకునే శక్తి ఏమాత్రం లేదు. దాని వెనక నడిపిస్తున్నది చైనా అని అందరికీ తెలిసిన విషయమే. అయితే నేపాల్ తమను భారత్ లో విలీనం చేసుకోమన్నపుడు అప్పట్లో మన నాయకులు చేయకుండా చేసిన తప్పిదాలు ఇప్పుడు ఆ దేశం గొంతెత్తి భారత్ వైపు తిరగబడుతుంది.

ప్రస్తుతం చైనా లద్దాక్ లో భారిగా సైన్యాన్ని మరియు యుద్ద విమానాల్ని మోహరించింది, ఒకపక్క భారత్ సైనికులతో గర్షణలకు దిగుతూ వెనకనుండి ఆ ప్రాంతంలో వందల సంఖ్యలో బంకర్లు, గుడారాలు, ఆర్మేడ్ వెహికిల్స్, తో పాటు నెలరోజుల్లోనే యుద్దవిమానాల లాండింగ్ బేస్ సైతం పూర్తి చేసింది. చైనా కు సంబంధించి సుమారు 5000 మంది జవాన్లను అక్కడికి తరలించింది.

జవాన్లతో పాటు ఎప్పుడూ ఒక్క యుద్దవిమానం తో గస్తీ చేసే చైనా ఆ ప్రాంతం లో నాలుగు యుద్ద విమానాల్ని మోహరించింది. దీనితో భారత్ సైతం లద్దాక్ కు భారీగానే జవాన్లను తరలిస్తుంది. భారత్ సైతం ఈ విషయం లో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని చెబుతోంది. చైనా చర్యలపై ప్రదాని నరేంద్ర మోడీ ఫ్యూచర్ ప్లాన్ అములుపై రక్షణ మంత్రి రాజ్ నాద్ సింగ్, జాతీయ బద్రతా సలహా దారు అజిత్ దోవల్, సహా ఆర్మీ చీఫ్ తో సహా పలువురు అధికారులతో విడివిడిగా  చర్చించారు.

దీనిలో ప్రాదనంగా భారత్, చైనా ల మధ్య నెలకొన్న బోర్డర్ వివాదం వీలైనంత వరకూ శాంతి చర్చలతోనే సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూడాలని, ఒకవేళ భారత్ సార్వభౌమత్వం, భారత భూభాగానికి ఆపద తలెత్తితే ఒక్క అడుగు కూడా వెనక్కు వేయ్యోద్దని అన్నట్లుగా తెలుస్తోంది.

అయితే ప్రధాని మోడీ చైనా ఎంత రెచ్చగొట్టినా మన సైన్యం అంతే దీటుగా జవాబిస్తూ లద్దాక్ లో కొనసాగుతున్న రోడ్డు మార్గం పనులు, వంతెనల పనులు చైనా నిరాకరించినా  మాత్రం యదావిధిగా తమ పనులు   కొనసాగించాలన్నారు.

దీనితో భారత్ ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్, ఆర్మ్ కొంబాట్ ట్రూప్స్ ను అధికారులు అలేర్ట్ చేసారు. చైనా లద్దాక్ ప్రాంతంలో మానవ రహిత హెలికాప్టర్ తో భారత భూబాగం దగ్గరగా డేటా కలెక్ట్ చేస్తుండడంతో భారత్ సైతం చైనా కవ్వింపులకు దీటుగా తేజస్ యుద్ద విమానాల్ని రగంలోకి దింపనుంది. చైనా పై అమెరికా ఆగ్రహ జ్వాలలు వెల్లగక్కుతుంది. చైనా ఏదైనా చిన్న తప్పు చేయకపోదా దాని పీచమనచాలని అమెరికా ఎదురు చూస్తుంది.

దీనిలో భాగంగా అమెరికా, మరియు ఆస్ట్రేలియా కు సంబంధించిన బారీ యుద్ద నౌకలు చైనా జలాల్లో భాహాటంగా తిరుగుతున్నా చైనా మాత్రం మిన్నకుండిపోయింది. సుమారు పదిరోజులుగా అమెరికా, ఆస్ట్రేలియా యుద్ద నౌకలు చైనా జలాల్లో గంటల తరబడి చక్కర్లు కొట్టాయి.

దీనిపై పలు మీడియా సంస్థలు చైనా ను నిలదీసినా చైనా ఏమీ చెయ్యలేక మౌన ప్రదర్శన చేసి తన యుద్దోన్మాదాన్ని భారత్ పై ప్రదర్శించాలని చూస్తోంది. అయితే చైనా కు తెలియదేమో ఇప్పుడు  ఉన్నది చైనా.. బెండు తీసే భారత్ అని.

RELATED ARTICLES

Most Popular