గాల్వాన్ లోయలో జరిగిన ఘటనకు భారతదేశం మొత్తం అట్టుడికిపోతోంది. చైనా పన్నిన కుతంత్రాన్ని చూసి ప్రపంచదేశాలు సైతం చైనా పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే మనలో మాత్రం 20 మంది మంచి జవాన్లను కోల్పోయిన దేశప్రజల రక్తం మరిగిపోయేలా చేస్తోంది. అసలు ఆరోజు జరిగిన ఘటనపై కొన్ని నిజాలు తాజాగా భయటికి వచ్చాయి. మొదటిగా చైనా బలగాలు తిరిగి వెళ్ళిపోతూ గాల్వాన్ లోయ ప్రాంతంలో వెనక వైపు గుడారాలు నిర్మించారు.
ఇది గమనించని మన మేజర్ సంతోష్ బాబు మరియు కొంత మంది ఆ కొండ ఎక్కి వాళ్ళు వెళ్ళిపోయారో లేదో కన్ఫాం చేసుకోవడానికి వెళ్ళడంతో అప్పటికే సుమారు రెండువందల మంది అక్కడ స్కెచ్ వేసుకుని ఇనుప రాడ్లు మరియు కర్రకు చుట్టిన ఫెన్సింగ్ వైర్లతో రడీగా ఉండగా మన మేజర్ సంతోష్ బాబు వారిని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని శాంతియుతంగా తెలిపారు.
అయినా చైనా ఆర్మీ సంతోష్ బాబు ను రాళ్ళు మరియు ఇనుప వైర్ తో అతి కిరాతకంగా కొట్టడంతో అది చూసిన బీహార్ రెజిమెంట్ కు చెందిన మన జవాన్లు ఆగ్రహంతో చైనా జవాన్లపై విరిచుకుపడి కొంతమంది వెన్నుపూసలు విరిచేయగా ఇంకొంతమందిని దొరికిన వాడిని దొరికినట్లు మెడలు విరగ్గొట్టడంతో పాటు కొంతమంది చైనా జవాన్ల ముఖం గుర్తుపట్టని విదంగా వారిపై దాడి చేసారు.
అంతే కాక చైనా ఆర్మీ పోస్టును తగలపెట్టేసారు. వీళ్లు చేసిన దాడికి 40కి పైగా చైనా జవాన్లు చనిపోగా సుమారు వంద మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. చైనా లో ఘాయాలైన చైనా జవాన్లతో అక్కడి ఆర్మీ హాస్పటల్ మొత్తం నిండిపోయినట్లు తెలుస్తోంది.
మన జవాన్లు దాడి చేసినాఎలాంటి గాయాలు కాకుండా ప్రత్యేకమైన దుస్తులు చైనా సైన్యం ధరించడంతో ముందుగా మన జవాన్లు పిడిగుద్దులు గుద్దినా వారికి ఏమీ కాకపోవడంతో ఇది గమనించిన మన జవాన్లు దొరికిన వాడిని దొరికినట్లు మెడలు విరిచేశారు. దీనితో మనవాళ్ళ దెబ్బలకి చైనా జవాన్లు పారిపోయారనే వార్త ఇప్పుడు బయటికి వచ్చింది.
ఈ దాడిలో పాల్గొన్న జవాన్లు మెరుపు దాడులు చేయగల బీహార్ రెజిమెంట్ కు చెందిన ఘాతక్ కమేండర్లు. వీరు 2016 పీఓకే లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ లో పార స్పెషల్ ఫోర్సెస్ తో పాటు ఆరుగురు బీహార్ ఘాతక్ కమాండోలు అప్పటి సర్జికల్ స్ట్రైక్ లో పాల్గొన్నారు.
ఈ ఘటనలో మన జవాన్లు ప్రతిఘటించిన ప్రదేశం చాలా చిన్నది కావడం పైగా చైనా జవాన్లు మనకంటే అదికంగా ఉండటం తో మన వైపు అంత మంది చనిపోయారని లేకపోతే ఇండియన్ జవాన్ల ముందు చైనా నిలువలేదని గాల్వాన్ ఘటనలో గాయాలనుండి కోలుకున్న మన జవాన్లు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్.. చైనా ఎటువంటి చర్యకు దిగినా వెంటనే ఎదురు దాడికి త్రివిధ దళాలను రంగంలోకి దిపింది భారత్.