IND vs NZ : న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ సిరీస్ నాలుగవ రోజు బరిలోకి దిగిన్ భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. మొదటిగా 14 రన్లకు మొదటి వికెట్ కోల్పోయిన భారత్ కైల్ జేమిసన్ 2 వికెట్లు తీయగా తరువాత సౌథీ మయాంక్ ను పెవిలియన్ కు పంపిన్ వెంటనే జేజాను కూడా సౌథీ అవుట్ చేసాడు.
india vs new zealand live score
IND VS NZ Live Score మద్యాహ్న భోజనం సమయానికే 84 రన్స్ చేసి 5 వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో కూరుకుపోయింది భారత్. అయితే శ్రేయస్ అయ్యర్ మరియు రవిచంద్రన్ అశ్విన్ కలిసి కొంచెం సేపు భాగస్వామ్యం నెలకొల్పి టీమ్ ఇండియా స్కోరు 100 దాటించారు. 62 బంతుల్లో 32 పరుగులు చేసాడు అశ్విన్.
అశ్విన్ తరువాతి ఓవర్ లో కైల్ జేమిసేన్ వేసిన బాల్ ని ఆఫ్ సైడ్ షాట్ ఆడబోయి ఇన్సైడ్ ఎడ్జ్ అయి అశ్విన్ బౌల్డ్ అయ్యాడు. తరువాత వచ్చిన వ్రుద్దిమాన్ సాహా క్రీజులో కొనసాగుతున్నాడు. భారత్ స్కోర్-111/6, కాగా ఇప్పటికి భారత్ 160 పరుగుల ఆధిక్యంలో ఉండగా శ్రేయస్ అయ్యర్ 82 బంతుల్లో 32 రన్స్ చేసాడు.