మంగళవారం, మార్చి 19, 2024
Homeక్రీడలుIND vs AUS మ్యాచ్ టికెట్లు దొరక్క తొక్కిసలాట ..పోలీసుల లాఠీచార్జ్..

IND vs AUS మ్యాచ్ టికెట్లు దొరక్క తొక్కిసలాట ..పోలీసుల లాఠీచార్జ్..

ఈ నెల 25 ఆదివారం నాడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరగభోయే IND vs AUS మూడవ T20మ్యాచ్ కి సంబంధిన టిక్కెట్ల వ్యవహారం రసాభాసగా మారింది. నేడు మ్యాచ్ టికెట్లు తీసుకోవడానికి జింఖానా గ్రౌండ్ వద్దకు ఉదయం 6 నుండే లైన్లో వేచి చూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ కు 10 గంటలైనా టిక్కెట్లు ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేసారు.

ఇదిలా ఉండగా ఉదయం 11 గంటల సమయానికి ఒక్కసారిగా మ్యాచ్ టికెట్ల కోసం సుమారు 3 వేల మంది అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతం రసాభాసగా మారింది. మొదట రెండు గంటలు రెండు కౌంటర్లలో మాత్రమె టికెట్ల పంపెనీ చేయడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసారు కొంత సేపటికే ఆన్లైన్ లో టికెట్లు అన్నీ అయిపోయాయని చూపించడంతో ఒక్కసారిగా టికెట్ కౌంటర్ల వైపు అభిమానులు వెళ్ళడంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగి 25 మంది వరకూ సృహతప్పి పడిపోయారు వీరిలో మహిళలు కూడా ఉన్నారు అయితే అక్కడికి చేరుకున్న పోలేసులు వారిని అదుపు చేయడంకోసం లాఠీ కి  పనిచెప్పారు. ఈ క్రమంలో పలువురు పోలీసులు కూడా తొక్కిసలాటలో పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.

మొత్తం ఈ వ్యవహారం పై ఫ్యాన్స్ HCA (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ టికెట్ల రిలీజ్ చేసే సమయంలో HCA ఎప్పుడూ ఇలాగే వ్యవహరిస్తుందని ఒక్కసారి కూడా టికెట్లు సక్రమంగా ఇచ్చిన దాఖలాలు లేవని ఎప్పుడూ బ్లాక్ లోనే టికెట్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు. అయితే నిన్న కొంత మందికి బ్లాక్ లో టికెట్లు లబించడంతో ఈ వ్యవహారంపై సదరు లాయర్ కోర్టుని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

ఈ నెల 20న రిలీజ్ కావాల్సిన IND vs AUS మ్యాచ్ టికెట్లను Paytm లో ఇప్పటకీ ఆన్లైన్ లో టికెట్ల విడుదల జరగపోవడం విచిత్రం. అయితే మొన్న కొంతమంది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లు ఇప్పుడు కేన్సిల్ అయిపోయి వాటి డబ్బులు టిక్కెట్ బుక్ చేసుకున్న వారి ఎకౌంటు కు తిరిగి రావడంతో వారు ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ HCA పై తీవ్ర విమర్శలు చేస్తూ వెంటనే ప్రసిడెంట్ పదవి నుండి అజారుద్దీన్ ను తీసివేయ్యాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే అదికారులు మాత్రం సర్వర్ ప్రాబ్లెం వల్లే ఇలా జరిగిందంటున్నారు అయితే ఇప్పటికీ Paytm లో Coming Soon అనే మెసేజ్ మాత్రమె కనిపిస్తుంది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular