ఏపీ జిల్లాల్లో కరోనా విలయ తాండవం ఇలా ఉంది

0
172
corona positive cases increased in andhra pradesh
corona positive cases increased in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది బుధవారం ఒక్కరోజే 67 మందికి కరోనా పాజిటివ్ అని తేలడం అందరినీ కలవరపెడుతోంది. తాజాగా ఈ కేసులన్నీ కలుపుకుని ఏపీ లో కరోనా బాధితుల సంఖ్య 111 కి చేరింది. ఢిల్లీ లో జరిగిన మతపరమైన ప్రార్థనలకు హాజరై వచ్చినవారు, వారితో సన్నిహితంగా తిరిగినవారి వల్లే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగినట్టు అధికార సమాచారం.

విదేశాలనుంచి వచ్చినవారు కూడా ఇందులో ఉన్నారు.  ఈ పరిస్థితి వల్ల ఏపీలో లాక్ డౌన్ మరింత కఠినం కానుంది.. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికొస్తే .. గుంటూరు 20, కృష్ణా 15, ప్రకాశం 15, కడప 15, పశ్చిమగోదావరి 14, విశాఖ 11, తూర్పుగోదావరి 9, చిత్తూరు 6, నెల్లూరు 3, అనంతపురం 2, కర్నూలు 1 ప్రతీ రాష్ట్రం లో అధికార యంత్రాంగం మరింత అలర్ట్ అయింది.

ఎక్కడివారు అక్కడే ఉండాలని ఈ పరిస్థితిని ఈజీగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ప్రజలు ప్రార్ధనల నిమిత్తం ఎక్కడా గుమికూడొద్దని అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీ జిల్లాల్లో