శుక్రవారం, మార్చి 31, 2023
Homeజాతీయంపెట్రోల్, డీజిల్ లీటర్ 35కే ఇస్తా... రాందేవ్ బాబా షాకింగ్ కామెంట్స్..!

పెట్రోల్, డీజిల్ లీటర్ 35కే ఇస్తా… రాందేవ్ బాబా షాకింగ్ కామెంట్స్..!

రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజల జేబులను కాళీ చేస్తుంది వారం రోజులక్రితం పెట్రోల్, డీజిల్ పెంపునకు నిరసనగా అన్ని రాష్ట్రాల ప్రజలు భారత్ బంద్ పేరిట పిలుపునిచ్చారు దీనితో రవాణా వ్యవస్థ మొత్తం ఎక్కడికక్కడే ఆగిపోయింది. బంద్ అయితే విజయవంతగా చేసారుకాని దీనిని కేంద్ర ప్రభుత్వం తమకేమి ఎరగనట్టు మిన్నకుండి పొయింది అదేకాక బంద్ పాటించిన రోజే పెట్రోల్, డీజిల్ పెంచడంతో ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై స్పందిస్తూ రాందేవ్ బాబా ప్రతీ రోజూ పెట్రోల్, డీజిల్ పెంపు వంటివి ప్రధాని మోదీ కొంప ముంచుతాయని యోగా గురు రాందేవ్ బాబా సున్నితంగా హెచ్చరించారు. ఇక ప్రభుత్వ పన్నుల్లో తమకు ఉపసమనం కలిగిస్తే తాను లీటర్ పెట్రోల్, డీజిల్ ను 35కే దేశంలోని పేద ప్రజలందరికీ అందిస్తానని చెప్పారు. ఎన్ డీ టీవీ నిర్వహించిన యూత్ కాంక్లేవ్ సదస్సులో మాట్లాడిన ఆయన పలు సమకాలీన అంశాలపై ఆయన ఆసక్తికర వ్యాక్యాలు చేసారు.

రోజు రోజుకూ విపరీతంగా  పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్  ధరలపై మొదీ తప్పక చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెట్రోలియం ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, వాటిని 28 శాతం శ్లాబ్ నుండి వెంటనే తొలగించాలని బాబా రాందేవ్ సూచించారు. ఇంధన దారలతోపాటు మిగతా వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని అన్నారు తమకు ఎటువంటి అవకాశం లేదని వాళ్ళు చెబుతున్నారని కానీ అది నిజం కాదని అన్నారు. రోజు రోజుకీ యువతలో అసహనం పెరిగిపోతుందని ఎటువంటి అవకాశాలూ లేవని వాళ్ళు భావిస్తున్నారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో రాందేవ్ మాట్లాడుతూ నేను డబ్బు వెనక వెళ్ళను.. డబ్బే నా వెనక వస్తుంది అని నేనో సైంటిఫిక్ సన్యాసినని  రాందేవ్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసారు. పతంజలిలో మొత్తం 300 మంది సైంటిస్టులు ఉన్నారని అన్నారాయన.

RELATED ARTICLES

Most Popular