ఇలాగైతే నేను రాజకీయాల నుండి తప్పుకుంటా YCP ఎమ్మెల్యే

0
193
YCP MLA Prasanna Kumar Reddy
YCP MLA Prasanna Kumar Reddy

ఒక పక్క కరోనా మరోపక్క ఏపీ రాజకీయాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఇలానే ఉన్నాయి. నెల్లూరు జిల్లా కోవూరు YCP ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పుడు కాంట్రవర్సీగా మారారు.

లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన ఆరోపణలతో ఎమ్మెల్యేనైన నా పైనే కేసు నమోదు చేస్తారా అంటూ 3 గంటల పాటు పోలీస్టేషన్‌ ముందు ధర్నా చేశారు. తనపై ఎందుకు కేసుపెట్టారని తమపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తేడాలొస్తే  రాజకీయాల నుంచి తప్పుకొంటానని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ పై కూడా ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శలు చేశారు. చివరకు కలెక్టర్ కలగజేసుకుని హామీ ఇవ్వడంతో ఆయన శాంతించారు. అయితే అసలు విషయానికి వస్తే నిన్న బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన  నిత్యావసర సరుకుల పంపిణీ కార్యాక్రమానికి.

వందల మంది హాజరయ్యారు. గుంపులు గుంపులుగా ఉంటూ ఎవ్వరూ భౌతిక దూరం పాటించకుండా వరుసలో నిల్చున్నారు.. ఈ  కారణంతో ఎమ్మెల్యే సహా ఏడుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపైనే ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహించారు. పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా చేశారు కలెక్టర్ జోక్యంతో పరిస్థితి సర్దుమణిగింది.