మంగళవారం, నవంబర్ 28, 2023
Homeరాజకీయంఎల్జీ ఫాలిమర్స్ విస్తరణ సాక్ష్యాధారాలు నాదగ్గర ఉన్నాయి..చంద్రబాబు

ఎల్జీ ఫాలిమర్స్ విస్తరణ సాక్ష్యాధారాలు నాదగ్గర ఉన్నాయి..చంద్రబాబు

విశాఖ లోని స్టెర్లింగ్ గ్యాస్ లీకేజీ ఘటనపై టీడీపీ మరియు వైసీపీ ల మద్య ఆరోపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి దీనిపై తాజాగా చంద్రబాబు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా స్పందించారు.

ఎల్జీ పాలిమర్స్ సంస్థకు టీడీపీ అనుమతులు ఇచ్చిందంటూ వైసీపీ సోషల్ మీడియాలో వీడియోలు, పోస్ట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం చేయడంతో దీనిపై చంద్రబాబు స్పందిచారు. పలువురు టీడీపీ నేతలతో వీడియో కాన్ఫెరెన్స్ సమావేశంలో పాల్గొని వైసిపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు.

తమ వద్ద ఎల్జీ ఫాలిమేర్స్ కు సంబంధించి మొత్తం సాక్ష్యాదారాలు ఉన్నాయని, పూర్వం అరవై ఏల్ల నుండి ఎవరెవరు ఎల్జీ ఫాలిమర్స్ కు భూములు ఇచ్చారో తమకు తెలుసన్నారు. ఎల్జీ ఫాలిమర్స్ విస్తరణ పనులకు వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని సూచించిందన్నారు.

లేకేజీ జరిగిన కంపెనీ పై ఇప్పటిదాకా కేసు నమోదు చేయకుండా ఒకవైపు చనిపోయిన బాదలో కుటుంబాలు ఏడుస్తుంటే నిరసన తెలిపినందుకు వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా అని మండిపడ్డారు.

బాదిత కుటుంబాలకు న్యాయం జరిగే దాకా టీడీపీ శ్రేనుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అంతేకాక ఎల్జీ ఫాలిమర్స్ ను అక్కడినుంచి తీసివేసి ప్రజలకు ఉపయోగపడే పర్యావరణహిత పనులను మొదలుపెట్టాలన్నారు. అయితే వైసీపీ నాయకులు అక్కడి ప్రజలపై నమ్మకం కలిగించాలని అయా ప్రాంతంలో నిద్రిస్తున్నామన్నారు.

అయితే ప్రస్తుతం కొందరు మంత్రులు నిద్రిస్తున్న వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో విజయసాయి రెడ్డి తో పాటి కొందరు మంత్రులో నిద్రిస్తున్న వీడియోలు ఇప్పడు వైరల్ గా మారాయి. విజయసాయి రెడ్డి ఉదయం పూట షూటింగ్ స్పాట్ బాగుందంటూ తెలుగు తమ్ముళ్ళు తెగ రచ్చ చేస్తున్నారు.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular