త్వరలో Hyper Aadi పెళ్లి .. అమ్మాయిది ఏ జిల్లానో తెలుసా

0
166
Hyper Aadi Marriage
Hyper Aadi Marriage

జబర్దస్త్ లో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకుని తన కామెడీ పంచులతో జనాన్ని కడుపుబ్బా నవ్వించే వ్యక్తి Hyper Aadi. జబర్ధస్త్ లో ఒక చిన్న ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టి అంచెలంచెలుగా అదే జబర్ధస్త్ లో ఓక మెయిన్ ఆర్టిస్ట్ గానే కాకుండా తన ప్రదర్శనతో జనాలను సైతం ఫాన్స్ గా మార్చుకున్నాడు హైపర్ ఆది. తన కళను ఒక షోకే పరిమితం చెయ్యకుండా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Hyper Aadi పెళ్లి పై అనేక సార్లు పలు రూమర్లు కూడా వచ్చాయి వాటి పై పెద్దగా స్పందించని ఆది  ఇప్పుడు తాను పెల్లిచేసుకూవాలని ఫిక్స్ అయ్యానని ,తాను పెళ్లి చేసుకునే అమ్మాయి తమ ప్రకాశం జిల్లా అమ్మాయే అని అయితే తాను తల్లితండ్రులు చూసిన అమ్మాయినే చేసుకుంటున్నానని చెప్పాడు.

పెళ్లి వచ్చే సంవత్ససరం ఉంటుందని అన్నాడు. అయితే Hyper Aadi చేసే ప్రతీ షోలో కూడా పెళ్లిపై పంచ్ డైలాగులు, పెల్లి చేసుకున్న వారి జీవితంపై ప్రతీ షో లోనూ సెటైర్లు వేస్తుంటాడు. అయితే ఇప్పుడు తన పెళ్లిపై అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఆది “సోలో లైఫే సో బెటర్”, “క్రాక్” సినిమాలలో నటిస్తున్నాడు.