Tuesday, October 20, 2020
Home భక్తి భక్తుల చెంతకు.. శ్రీవారు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఎలా జరగనున్నాయి..?

భక్తుల చెంతకు.. శ్రీవారు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఎలా జరగనున్నాయి..?

తిరుమల శ్రీవారి ఆలయం అనగానే కిలోమటర్ల పొడవు క్యులతో, ఇసుక వేస్తే రాలనంతగా జనం, గదుల కోసం ముందే బుకింగ్స్, ఆ స్వామి వారి దర్శనం కోసం గంటల కొద్ది భక్తుల నిరీక్షణ.. కానీ కరోనా వైరస్ ప్రభావం వల్ల జనం లేక ఆలయం అంత బోసిపోయింది.

అయినా సరే కొండ మీద ఉన్న గోవిందుడు నామస్మరణం ఆగలేదు. నిన్న మొన్నటి దాకా బోసిపోయిన మాడ వీధులు ఇప్పుడు ఇప్పుడే కళకళలాడుతున్నాయి. శ్రీవారి సలకట్ల బ్రహ్మోత్సవాలు ఏకంతంగానే ఆలయ ప్రాంగణాలకే పరిమితమైన తిరుమలేశుడు.. నవరాత్రి బ్రహ్మోత్సవాలు మాత్రం మాడ వీధుల్లో భక్తుల కోలాహలాల మధ్యలో నిర్వహించనున్నారు టీటీడీ.

ఈ నెల 1న అన్నమయ్య భవన్ లో సమీక్ష నిర్వహించిన ఈవో ధర్మారెడ్డి  ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. దర్శన టిక్కెట్లు ఉన్నవారికి మాత్రమే తిరుమల కి అనుమతి ఇవ్వాలని భావించి.. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో రోజుకు 16000 చొప్పున ప్రత్యక ప్రైవసీ టికెట్లు విడుదల చేశారు. వీటితో పాటు శ్రీవారి డ్రెస్, కళ్యాణోత్సవం టికేట్లు విక్రయించారు.

ఈ నెల 16 నుంచి 24 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. గతంలో ప్రత్యేక టికెట్స్ ఉన్నవారికి మాత్రమే ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవ్చు అని సమావేశంలో నిర్ణయించగా. రోజు రోజుకీ కరోనా ప్రభావంలో వల్ల కేసులు పెరగడంతో ఆ శ్రీవారి నవరాత్రుల బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతాయా..? మాడ వీధుల్లో నిర్వహిస్తారా..? అని తిరుమల తిరుపతి దేవస్థానం పునరాలోచనలో పడింది.

శ్రీవారి నవరాత్రులు భక్తుల మధ్యలో నిర్వహించెందుకు ఏర్పాట్లు చేస్తున్న వేల తాజా పరణామాలతో అధికారుల్లో మరియు భక్తులలో గందరగోళం నెలకొంది. తిరు వీధుల్లో నిర్వహణ పై పునరాలోచన చేయాలన్న ఈవో. కరోనా వ్యాప్తి చెందటం తో భక్తుల నియంత్రణలో ఇబ్బందులు కలుగుతాయి అని చర్చించారు.

టీటీడీ ఈవో అయిన జవహర్ రెడ్డి తనికీలు చేసి మాడ వీధుల్లో చేసిన ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు.  బ్రహ్మోత్సవాల నిర్వహణకు సన్నద్ధమవుతున్న పోలీస్ శాఖ. కరోనా నియంత్రణపై ఫోకస్ పెట్టామన్న తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి. బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహించాలన్నదనిపై నిర్ణయం తీసుకోనున్న టీటీడీ.

Most Popular