తేనే ఆరోగ్యానికి చాలా మేలుచేసే ప్రకృతి ప్రసాదించిన ఓ గొప్ప వరం.. ఈ భూప్రపంచంలో పాడవని పదార్దం ఏదైనా ఉందా అంటే..అది తేనె మాత్రమే. చాలాకాలం వాడకపొతే చిన్న చిన్న స్పటికాల్లాగ కనబడుతయి. ఆసీసాను వేడినీళ్ళలో వుంచితే మళ్ళీ మామూలు తేనెలాగ మారిపోతుంది. దయచేసి తేనెను ఎలక్ట్రిక్ పరికరాలతో వేడి చేసేందుకు ప్రయత్నించకూడదు. దానివలన అందులోని పోషకపదార్ధాలు నశిస్తాయి.
Benefits of Honey
తేనెతోపాటు దాల్చినచెక్కతోడయితే రోజూ మనం ఎదుర్కొనే ఆరోగ్యసమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందుకే చాలామంది తేనెను రామబాణంతో పోలుస్తారు. ఏ వ్యాధికైనా తేనెను వాడవచ్చు తేనెవల్ల ఎటువంటి సైడెఫెక్ట్స్ ఉండవు. డయాబెటిస్ సమస్య వున్న వాళ్ళు కూడా తగు మోతాదులో తీసుకుంటే మంచిది.