కొద్ది రోజుల క్రితం ఏపీకి చెందిన ఒక యూట్యూబ్ చానల్, వెబ్సైట్ పై సీఐడీ అధికారులు జగన్ ను ఉద్దేసించి అసభ్యంగా ఆర్టికల్ రాసారనే ఉద్దేశంతో జగదీష్ అనే వ్యక్తి వారిపై పోలీసులకు పిర్యాదు చెయ్యగా కొన్నిరోజుల క్రితం సీఐడీ కేసు నమోదు చేసి ఆ చానల్ కు చెందిన కెమెరాలను సైతం స్వాదీనం చేసుకోవడంతో వారు కోర్టుని ఆశ్రయించగా ఈ కేసు వాదనలు విన్న కోర్టు రాష్ట్ర సీఐడీ, పోలీసులపై ఏపీ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిరాధార కేసులు మరియు వేదింపులతో అరాచకాలకు బాటలు వేస్తునట్లు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీరు ఉన్నది ప్రజలను కాపాడడానికేనా అని వ్యాక్యానించిన హైకోర్టు అధికారంలో ఉన్న పార్టీ మెప్పుకు అత్యుత్సాహానికి పాల్పడుతున్నారని తెలిపింది. అంతేకాక పార్టీలకు అతీతంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించింది. ఆదారాలు లేకుండా కేసులు నమోదు చేసి దర్యాప్తు పేరుతో వారిని స్టేషన్ చుట్టూ తిప్పుకుని వేధింపులకు గురిచేయడం అరాచకాలకు దారితీసే విధంగా ఉందని తెలిపింది.
ఇలాంటి చర్యలను నియంత్రించకపోతే ప్రజలకు జీవించే హక్కుకు బంగం కలుగుతుందని పేర్కొంది. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే ప్రభుత్వం మొత్తం ఏమైనా కూలిపోతుందా అంటూ ఘాటుగా స్పందించింది. అంతే కాక సదరు ఎలక్ట్రానిక్ మీడియా యజమానుకు బెయిల్ ఇస్తూ వారం రోజుల లోగా సీజ్ చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. గత కొన్నాళ్ళుగా ఏపీ సీఐడీ మరియు పోలీసులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు మరియు కామెంట్స్ చేస్తున్న వారిపై పలు కేసులు పెడుతుంది.
అయితే వీటిలో కొన్ని ఎలాంటి తప్పూ చేయకపోయినా రాజకీయ నాయకుల ఒత్తిడి చేత తమపై అనేక సెక్సన్లపై కేసులు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించుకున్తున్నారని ఇప్పటికే చాలా మంది కోర్టుని ఆశ్రయిస్తున్నారు. వీరి తీరుపై కోర్టు అనేక సార్లు మందలించినా ఏమాత్రం వారి పంథా మార్చుకోవడం లేదు.