గురువారం, ఏప్రిల్ 18, 2024
Homeరాజకీయండాక్టర్ సుధాకర్ కేసులో ప్రభుత్వం పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.

డాక్టర్ సుధాకర్ కేసులో ప్రభుత్వం పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.

కొన్నాళ్ళ క్రితం సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ కేసు ఇప్పుడు హై కోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై స్పందించిన టీడీపీ మాజీ మంత్రి చినరాజప్ప జగన్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకు నేటి హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టు గా ఉందని అన్నారు.

ఏ పాపం చేసారని ఆయన్ను చిత్రహింస చేసి నడిరోడ్డుపై చితక బాదారన్నారు. విశాఖ లో చంద్రబాబును సైతం ఇదే విధం గా పోలీసులు అడ్డగించి పోలీసులు అన్యాయంగా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. డీజీపీ, సీపీ ని కోర్టు మందలించినా వారిలో ఎటువంటి మార్పూ లేదన్నారు.

అయితే నేడు హై కోర్టులో డాక్టర్ సుదాకర్ పై కేసు వాదనలకు రావడంతో ఇప్పటికే హాస్పటల్ లో చికిత్స పొందుతున్న డాక్టర్ సుదాకర్ వద్ద నుండి వాంగ్మూలం తీసుకోవాలని హై కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

మేజిస్ట్రేట్ సైతం డాక్టర్ సుదాకర్ శరీరంపై గాయాలున్నాయని సమర్పించింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో మాత్రం ఎటువంటి గాయాలు లేవని నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వంపై సీరియస్ అయిన హైకోర్టు.

ప్రభుత్వం ఇచ్చిన నివేదిక కేసును తప్పు దోవ పట్టించేదిగా ఉందంటూనే మీరు నిజాలు దాచిపెడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే ఈ ఘటనపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఈ గటనలో ఉన్న పోలీసులపై కేసు నమోదు చెయ్యాలని ఆదేశించింది. అయితే ఇప్పటికే ట్రాఫిక్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసారు. మొత్తం విచారణకు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది.  

ఒక వైపు డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా తో పోరాడుతుంటే ఆ డాక్టర్లకు సాయం చేయక పోగా ప్రభుత్వం కక్ష పూరిత దోరణిలో వ్యవహరించడం పై సర్వత్రా జగన్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం డాక్టర్ సుదాకర్ కి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పెరుగుతుంది. మరోవైపు రాష్ట్ర డాక్టర్ల అసోషియేషన్ కూడా సుదాకర్ కు మద్దతు తెలిపింది.

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular