జలుబు, పడిశము: జలుబు పడిశం అనేవి మనం త్రాగే నీటి నుండి ఎక్కువగా వస్తుంది దీనికి ఒక పెద్ద చెంచా తేనె మరియు పావు చెంచా దాల్చిన చెక్క పొడి కలుపుకొని మూడు రోజులు పాటు సేవిస్తే జలుబు, దగ్గు తగ్గుతుంది.
రక్తపోటు:ఇది నలభై సంవత్సరాలు పైబడిన వారికి ఎక్కువగా వస్తుంది. నివారణకు ఒక స్పూను తేనె ఒకస్పూను అల్లం రసం మరియు ఒకస్పూను వెల్లుల్లి రసం కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే దేనినుండి ఉపసమనం లబిస్తుంది .
గుండెజబ్బులు:గుండె జబ్బు నివారణకు దానిమ్మ జూస్ అద్భుతంగా పనిచేస్తుంది. అంతే కాక తేనె మరియు దాల్చినచెక్క పొడి బాగా కలిపి రొట్టె ముక్కలపై జాం లాగ వాడాలి ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తనాళాలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె పోటు రాకుండా కాపాడుతుంది.
మధుమేహం: మధుమేహం నివారణకు మామిడాకులను రాత్రిపూట నీటిలో కాచి వాటిని ఉదయం వడకట్టి తాగవలెను. అంతే కాక ద్రాక్ష పళ్ళు రోజుకు రెండు లేదా మూడు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో వుంటుంది.
ఆస్తమా: ఆస్తమా నివారణకు మరియు అది ఆస్తమా అదుపులో వుండాలంటే దాల్చిన చెక్క పొడిచేసి దానిలో ఒక స్పూన్ తేనె కలిపి సేవించడం వలన ఆస్తమా అదుపులోకి వస్తుంది.
మొటిమలు: మూడు పెద్దచెంచాల తేనె ఒకచిన్నచెంచా దాల్చినపొడి పేస్టులాగ కలుపుకొని మొటిమలకి పట్టించి మర్నాడు ఉదయం వేడి నీళ్ళతో కడుక్కోవాలి. ఇలారెండు వారాల పాటు ఆచరిస్తే మొటిమలు మాయం.
కీళ్ళవాతం: రోజూ పొద్దున్న, సాయంత్రం ఒక కప్పు వేడినీళ్ళలో ఒక చెంచా తేనె, అరచెంచా దాల్చిన పొడి ఒక నెల రోజుల పాటు వాడితే నోప్పులు మటుమాయం.
కొలెస్ట్రాల్: రెండుపెద్దచెంచాలు దాల్చినపొడి మూడు చిన్నచెంచాలు తేనె, అరగ్లాసు టీనీళ్ళతో కలుపుకొని తాగితే కొలెస్ట్రాల్ అదుపులో వుంటుంది.
కడుపులో గడబిడ: ఒకపెద్దచెంచా దాల్చినపొడి ఒకచిన్నచెంచాతేనె కలుపుకొని తాగితే గ్యాస్ వంటి ఉదర సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. గమనిక : Health Tips వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించవలెను.